Telangana SSC Exams : టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫీజు గడువు పొడిగింపు – కొత్త తేదీలివే
Telangana SSC Exam Fees Schedule 2024 : పదో తరగతి పరీక్షల ఫీజుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటనను విడుదల చేసింది.
TS SSC Public Exams 2024 Updates : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది ప్రభుత్వ పరీక్షల విభాగం. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేయగా… నవంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే గడువు సమయం దగ్గర పడిన నేపథ్యంలో…. సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటను విడుదల చేసింది.
రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు…. రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 3 వరకు చెల్లించవచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మూడు సబ్జెక్టులు, అంత కంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110 చెల్లించాలి. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125 ను కట్టాలి. వొకేషనల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలో మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇక పూర్తి వివరాల కోసం https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
పదో తరగతి ఫీజు చెల్లింపు – ముఖ్య తేదీలు:
పరీక్ష ఫీజుకు తుది గడువు – 02.12.2023.
50 రూపాయల రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది – 12.12.2023.
రూ.200 లేట్ ఫీజుతో చెల్లించడానికి చివరితేదీ – 21.12.2023.
రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది – 03.01.2024.
అధికారిక వెబ్ సైట్ – https://bse.telangana.gov.in/