HYD IT Raids: హైదరాబాద్‌‌లో ఫార్మా కంపెనీలపై ఐటీ దాడులు

 HYD IT Raids: హైదరాబాద్‌‌లో ఫార్మా కంపెనీలపై ఐటీ దాడులు

HYD IT Raids: ‍హైదరాబాద్‌లో తెల్లవారు జాము నుంచి ప్రముఖ ఫార్మా కంపెనీ ఛైర్మన్, సీఈఒ, డైరెక్టర్లు, ఉద్యోగుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఐటీ దాడులు (HT_PRINT)

HYD IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ ‍ఛైర్మన్‌ నివాసంతో పాటు సీఈఓ, ఎండీ, ఇతర ఉద్యోగుల నివాసాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పటేల్ గూడలో ఐటీ సోదాలు నిర్వహించారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మైహోమ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రదీప్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారు జాము నుంచి 15బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. శంషాబాద్‌, ఔటర్ రింగ్ రోడ్డు, రాయదుర్గం, ఫార్మా కంపెనీ ఎండి, సీఈఓ, డైరెక్టర్ నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ నాయకులు టార్గెట్‌‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఫార్మా కంపెనీ యజమాని లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతుండటంతో ఏమి జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహిస్తున్నారా, రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న వారికి సంబంధించిన వ్యాపారాలపై ాదాడులు జరుగుతున్నాయా అనేది తెలియాల్ిస ఉంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *