Dhanteras 2023 date and time: ధన త్రయోదశి ఎప్పుడు? పండగ ఎలా జరుపుకోవాలి?

 Dhanteras 2023 date and time: ధన త్రయోదశి ఎప్పుడు? పండగ ఎలా జరుపుకోవాలి?

Dhanteras 2023 date and time: ధన త్రయోదశితో దీపావళి వేడుకలు ప్రారంభం కానున్నాయి. తేదీ, ముహూర్తం, ఈ పండగ ఎలా జరుపుకోవాలి? వంటి సందేహాలకు ఇక్కడ సమాధానం తెలుసుకోండి.

ధన్‌తేరాస్‌ను ధన త్రయోదశి అంటారు. దీనినే ధన్వంతరీ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ పండగతోనే 5 రోజుల దీపావళి పండగ మొదలవుతుంది. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి, బంగారం, వెండి కొనుగోలుకు, నూతన వంట సామాగ్రి (గిన్నెలు వంటివి), ఇంటి సామాగ్రి కొనుగోలుకు ఇది శుభ దినం.

ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున ఈ పండగను జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజున లక్ష్మీ దేవత పూజలందుకుంటారు. సంపదకు దేవుడిగా భావించే కుబేరుడిని కూడా ఈ రోజు పూజిస్తారు. ధన్వంతరీ జయంతిని కూడా ఈ ధన త్రయోదశి రోజు జరుపుకుంటారు. ధన్వంతరీ కూడా విష్ణు అవతారమని, క్షీర సాగర మథనంలో ధన్వంతరీ ఒక చేతిలో అమృత కలశాన్ని, మరొక చేతిలో ఆయుర్వేదాన్ని తీసుకొస్తూ ఆవిర్భవించాడని విశ్వాసం. సంపదకు, ఆరోగ్యానికి, స్వస్థతకు దైవమని, ఈ విశ్వానికి ఆయుర్వేదాన్ని అందించాడని విశ్వాసం. ఈ ధన త్రయోదశి రోజున జాతీయ ఆయుర్వేద దినంగా జరుపుకుంటారు.

ధన త్రయోదశి తేదీ

ఈ ఏడాది నవంబరు 10న ధన త్రయోదశి జరుపుకుంటారు. మరుసటి రోజు నవంబరు 11న నకర చతుర్ధశిగా, చోటీ దీపావళిగా జరుపుకుంటారు. నవంబరు 12న దీపావళి పర్వదినాన్ని లక్ష్మీదేవికి పూజలు చేస్తూ జరుపుకుంటారు. నవంబరు 13న గోవర్దన పూజ, నవంబరు 14న భాయ్ దూజ్ జరుపుకుంటారు.

ధన్‌తేరాస్ 2023 సమయం, ముహూర్తం

ధన్‌తేరాస్ (ధన త్రయోదశి) పూజ సాయంత్రం 5.47 నుంచి రాత్రి 7.43 వరకు జరుపుకోవాలి. లక్ష్మీ దేవత, గణేషుడు, ధన్వంతరి, కుబేరులను పుష్పాలు, మాలలతో పూజించాలి. గోధుమ పిండితో చేసిన హల్వా, బూందీ లడ్డూ, ధనియాలు-బెల్లంతో చేసిన ప్రసాదం వంటివి దేవతలకు సమర్పిస్తారు. ఈ సమయంలో అమ్మవారి రూపాలైన మహాలక్ష్మీ, మహా కాళి, సరస్వతీ దేవిని పూజిస్తారు

పూజా సమయం, శుభముహూర్తం

ధన త్రయోదశి పూజా ముహూర్తం : సాయంత్రం 5.47 నుంచి 7.43 వరకు

వ్యవధి: 1 గంటా 56 నిమిషాలు

ప్రదోష కాలం: సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.08 గంటల వరకు

త్రయోదశి తిథి ఆరంభం: నవంబరు 10, 2023 సమయం 12.35 గంటలు

త్రయోదశి తిథి ముగిసే సమయం: నవంబరు 11, 2023 మధ్యాహ్నం 1.57

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *