అక్టోబరు 26 నేటి రాశి ఫలాలు.. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరుతాయి

 అక్టోబరు 26 నేటి రాశి ఫలాలు.. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరుతాయి

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు అక్టోబరు 26, 2023 తేదీ గురువారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

వారం: గురువారం, తిథి: ద్వాదశి,

నక్షత్రం: పూర్వాభాద్ర, మాసం: ఆశ్వయుజం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

1.మేషరాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. ఇతరులకు సాయపడతారు. ఉద్యోగులకు ఉన్నత హోదా లభించును. కుటుంబంలో వివాహ ప్రయత్నాలు సానుకూలం. కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనుకోని లాభాలుంటాయి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
==========================================================================

2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఉద్యోగులకు విశేష గుర్తింపు రాగలదు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దీర్హకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
===========================================================================

3.మిథునం రాశి ఫలాలు 2023

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మొదలుపెట్టిన పనులు కొన్ని విజయవంతంగా పూర్తిచేస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. గృహం, వాహనాలు కొంటారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. వ్యాపారులకు కోరుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. సోదరీ, సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శ్రమ ఫలిస్తుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.
========================================================================

4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. వాహన సౌఖ్యం. మీ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. శివపార్వతులు అర్ధనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
==========================================================================

సింహరాశి ఫలాలు 2023

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలొస్తాయి. ముఖ్య వ్యవహారాలు సజావుగా పూర్తిచేస్తారు. మీ నిర్ణయాలు అందరినీ మెప్పిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు ధనమును ఖర్చుచేస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
============================================================================

6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆశయాల సాధనలో ఆప్తుల సహకారం అందుతుంది. ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ఇంటి నిర్మాణాల్లో అటంకాలు తొలగుతాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం ఇష్టదైవ ప్రార్థన చేయండి.
=============================================================================

7.తులారాశి రాశి ఫలాలు 2023

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తమునుండి అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలేర్పడుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆదాయానికి ఏమాత్రం లోటు రాదు. శివపార్వతులు అర్ధనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
=============================================================================

8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారాలకు ఆటంకాలు తొలగుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరే సమయం. మనసులో అనుకున్నది తక్షణం జరిగి ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖ వ్యక్తులో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారంలో ఒడిదుడుకులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన, గృహ కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిళ్ళ నుండి విముక్తి కలుగును. అందరిలో గుర్తింపు పొందుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వేడుకలు, సమావేశాలకు హాజరవుతారు. ఆస్తులకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. తండ్రి తరపువారి నుంచి ధనలబ్ధి. ఖర్చులు పెరిగినా ధనమునకు లోటుండదు. పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. ఉద్యోగులకు ప్రమోషన్లు. శివపార్వతులు అర్ధనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
=========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారులకు ఊహించని లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం. విద్యార్థులకు అనుకూల సమయం. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభించును. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాల్లో పురోగతి. రుణభారాలు తొలగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉంది. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు. వ్యాపారస్తులకు లాభదాయకం. కొత్త భాగస్వాముల చేరిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని రుణాలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. పలుకుబడిన కలిగిన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఇష్టదైవ ప్రార్థన చేయండి.

==========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *