horoscope today 16 September 2023 ఈరోజు ఈ రాశుల వారికి శుక్ర, బ్రహ్మ యోగాలతో శుభ ఫలితాలు…!
horoscope today 14 October 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనివారం రోజున చంద్రుడు తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశుల
horoscope today 16 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజున శుక్ర, బ్రహ్మయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మరికొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
1.మేషరాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు పిల్లల వైపు నుంచి కొన్ని సంతోషకరమైన వార్తలను వింటారు. దీని వల్ల మీకు సంతోషం కలుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు ఉద్యోగం, వ్యాపారులు సహోద్యోగుల నుంచి తగిన మద్దతు పొందుతారు. మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి కొంత డబ్బును ఖర్చు చేస్తారు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది.
ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో వ్యాపారులు, ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈరోజు మీ ఇంట్లో లేదా బయట ఏదైనా కోపంగా ఉన్న పరిస్థితుల గురించి కోపం తెచ్చుకోవద్దు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు మీరు కచ్చితంగా కొన్ని అపారమైన ప్రయోజనాలు పొందొచ్చు.
ఈరోజు మీకు 96 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో విద్యార్థులు విద్యపై ఆసక్తిని పెంచుకుంటారు. మీరు ఈరోజు కష్టపడి పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాల కోసం అనేక కొత్త అవకాశాలను పొందుతారు. ఈరోజు సోమరితనాన్ని అధిగమించాల్సి ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి మతపరమైన కారణాలతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారికి సోదరులు, సోదరీమణుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు వ్యాపారులు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. లేదంటే మీకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీరు పాత విషయాల గురించి కొంత ఆలోచిస్తారు. ఉద్యోగులు ఈరోజు సులభంగా పనులు పూర్తి చేస్తారు. ఈ సాయంత్రం మీరు మీ తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాలను చర్చించాల్సి ఉంటుంది.
ఈరోజు మీకు 94 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాలి.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి మంచి ప్రయోజనాలొస్తాయి. మీకు కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. మీ పెండింగ్ పనులు ఈరోజు పూర్తవుతాయి. ఈరోజు మీరు సాయంత్రం వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొందరు సీనియర్ల మాటల వల్ల మీ మనోబలం పెరుగుతుంది.
ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఎవరి నుంచి సహాయం ఆశించొద్దు. మరోవైపు పెండింగులో ఉన్న పనుల్లో పురోగతి పొందుతారు. మీ కుటుంబంలో ఏదైనా అసమ్మతి ఉంటే, అది మళ్లీ ఇబ్బంది పెట్టొచ్చు. మీ మాటతీరును జాగ్రత్త పరచుకోవాలి. లేదంటే దాని వల్ల మీకు సమస్యలు పెరుగుతాయి. మీరు మీ బిడ్డను ఏదైనా కోర్సులో చేర్చాలనుకుంటే, ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏదైనా యాత్రకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సాయంత్రంలోగా మీ పనులు ఏవైనా పూర్తయితే, మంచి విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన సమావేశంలో పాల్గొనొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండొచ్చు.
ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
రాశి వారిలో కుటుంబ జీవితంలో కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు కొంత డబ్బులు ఖర్చు చేస్తారు. బిజీ కారణంగా, మీరు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. కాబట్టి వాటిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏదైనా విద్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు. కొన్ని పనుల గురించి కొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేయడంలో ఏదైనా కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడంలో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. మీ పిల్లల సమస్యలను వింటూ సాయంత్రం గడుపుతారు. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, మీ సోదరులు, సోదరీమణుల సహాయంతో పరిష్కారాన్ని కనుగొనడంలో విజయం సాధిస్తారు.
ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ జీకి సిందూరం సమర్పించాలి.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో వ్యాపారులు చిన్న చిన్న రిస్క్‌లు తీసుకోవచ్చు. సీనియర్ సభ్యుల సహాయంతో మాత్రమే పెద్ద రిస్క్ తీసుకోవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి కఠినమైన మాటలు వినొచ్చు. ఉద్యోగులు మహిళా స్నేహితురాలి సహాయంతో ప్రమోషన్ పొందొచ్చు. ఈరోజు మీరు మీ పనిని పూర్తి చేయడానికి మీ తండ్రి నుంచి సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించాలి.
=========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనిని సీనియర్ సభ్యుల సలహా తీసుకున్న తర్వాతే చేయాలి. లేదంటే భవిష్యత్తులో మీకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. విద్యా్ర్థులు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ఉద్యోగంలో పైఅధికారుల కోపాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు విష్ణు సహస్రాన్ని పఠించాలి.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. మీరు దానధర్మాలలో ఎక్కువ సమయం గడుపుతారు. మీ పనులు పూర్తవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్యం కారణంగా, సాయంత్రం మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అవివాహిత వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు.
ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
==========================================================================================