horoscope today 12 October 2023 ఈరోజు ఓ రాశి వారు పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు..!
horoscope today 12 October 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురువారం రోజున చంద్రుడు సింహ రాశి నుంచి కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యం.
horoscope today 12 October 2023 ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వ ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శుక్ల యోగం, బ్రహ్మ యోగం కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
1.మేషరాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. దీని కోసం మీరు కొంచెం కష్టపడాలి. మీ ప్రియమైన వ్యక్తి మీపై కోపంగా ఉంటే, మీరు అతనికి బహుమతి పంపొచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహాయాన్ని పొందుతారు. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు పని చేసే వ్యక్తులు సహోద్యోగుల నుండి సహాయం పొందుతారు. దీని వల్ల మీ పని సులభమవుతుంది.
ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో ఉద్యోగులు, వ్యాపారులకు శత్రువులు కొన్ని ఇబ్బందులు సృష్టించొచ్చు. పై అధికారుల సహాయంతో, సీనియర్ సభ్యుల సహాయంతో మీరు వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఒకరి భూమి లేదా భవనాన్ని కొనుగోలు చేయబోతున్నట్లయితే, దాని ముఖ్యమైన పత్రాలను మీరే తనిఖీ చేయండి. ఈరోజు మీరు మీ కుటుంబం నుండి ఫోన్‌లో కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఇంతకు ముందు ఎక్కడైనా పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. వాటి నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతారు.
ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ప్రియమైన, ముఖ్యమైన వస్తువులలో ఏదైనా కోల్పోతే, దాన్ని తిరిగి పొందొచ్చు. దీని వల్ల మీరు చాలా సంతోషిస్తారు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యునికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో బిజీగా ఉంటారు. ఈరోజు ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు లేదా శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చించుకోవచ్చు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేయడానికి కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.
ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో వ్యాపారులు తాము చేసే వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు సీనియర్ల సలహాలు తీసుకోవాల్సి రావచ్చు. అయితే అనుభవజ్ఞుల సలహాలు మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఈరోజు కుటుంబంలోని చిన్న పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రియమైన వారిని కలవడానికి ఉత్సాహంగా ఉంటారు. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం కొంత దూర ప్రయాణం చేయొచ్చు.
ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే, నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. మీరు మీ ఆస్తిని పొందొచ్చు. ఇది మీ సంపదను పెంచుతుంది. విద్యార్థులు పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ మనస్సులోకి ప్రతికూల శక్తులు రాకుండా కాపాడుకోవాలి. అప్పుడే మీరు అన్ని పనులు పూర్తి చేయగలరు. విద్యార్థులు ఏదైనా కోర్సులో ప్రవేశం పొందాలనుకుంటే ఈరోజే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చీమలకు పిండిని వేయాలి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా పూర్తి ఉత్సాహంతో చేస్తారు. దీంతో మీరు శుభ ఫలితాలను సాధిస్తారు. మరోవైపు కొన్ని పనుల గురించి మీరు ఆందోళన చెందుతారు. దీని వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే, మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు మీ బంధువులకు అప్పు ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే అది మీ సంబంధాలలో సమస్యలను కలిగిస్తుంది.
ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ శివ చాలీసా పఠించాలి.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో ప్రేమ జీవితంలో ఉండే వ్యక్తులు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి రావొచ్చు. అయితే వారి లాభనష్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అలా చేయాల్సి ఉంటుంది. మీ ఇంటి జీవితంలో కొత్త శక్తి నింపబడుతుంది. సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామిని నడకకు తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీకు వ్యాపారంలో లేదా ఇంట్లో ఎవరితోనైనా వాగ్వాదం ఉంటే, మీరు అందులో జోక్యం చేసుకోకూడదు. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సూర్య నారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. సాయంత్రం బయటకు వెళ్లేటప్పుడు మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు. ఈరోజు మీరు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వారికేదైనా జబ్బు ఉంటే వారి బాధలు ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే, దానికి మీ జీవిత భాగస్వామి మద్దతు అవసరమని గుర్తుంచుకోవాలి.
ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వాటికి పరిష్కారం కనుగొనడంలో విజయం సాధిస్తారు. ఉపాధి కోసం పని చేసే వారు వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు ప్రమోషన్ పొందుతారు. ఈ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మీ స్నేహితులలో ఒకరికి కొంత డబ్బును కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. వారి ఉన్నత విద్యకు కూడా బాటలు వేయనున్నారు.
ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ క్రిష్ణుడికి వెన్న, పంచదార మిఠాయిలను సమర్పించాలి.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
ఈ రాశి వారు ఈరోజు కష్టపడి ఏ పని చేసినా, ఫలితం మీకు సంతోషంగా అనిపించొచ్చు. ఈరోజు పని చేసే వ్యక్తులు తమ శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈ కారణంగా పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది. దీని గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. కానీ సాయంత్రంలోగా దాన్ని పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారు.
ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి
=========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అపరిచితులను నమ్మవద్దు. ఆత్మీయుల సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఆరోగ్యం బాగుటుంది. అవివాహితులు శుభవార్త వింటారు. ఆధ్యాత్మికతపై ఆకస్తి కలుగుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొంతమంది మోసగించేందుకు యత్నిస్తారు. గృహమార్చు అనివారం. ఆరోగ్యం జాగ్రత్త. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
==========================================================================================