TSGENCO : తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్ ఉద్యోగాలు – అప్లికేషన్స్ ప్రారంభం, ముఖ్య తేదీలివే

 TSGENCO : తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్ ఉద్యోగాలు – అప్లికేషన్స్ ప్రారంభం, ముఖ్య తేదీలివే

TSGENCO Recruitment 2023 Updates: తెలంగాణ జెన్ కో నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటనను జారీ చేసింది. అక్టోబరు 7వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 3ను పరీక్ష తేదీగా ప్రకటించారు.
TSGENCO Chemist Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌( జెన్‌కో‌) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 60 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 7వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…. అక్టోబరు 29వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. హాల్ టికెట్లను పరీక్షకు ఏడు రోజుల ముందు విడుదల చేస్తామని జెన్ కో వెల్లడించింది.

ముఖ్య వివరాలు :
భర్తీ చేసే సంస్థ – తెలంగాణ జెన్ కో

ఉద్యోగాలు – కెమిస్ట్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య – 60(లిమిటెడ్ రిక్రూట్ మెంట్3, జనరల్ రిక్రూట్ మెంట్ 57)

అర్హత- ప్రథమ శ్రేణిలో Msc (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి – 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం – అక్టోబరు 7వ తేదీ

దరఖాస్తు, పరీక్ష రుసుం – దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం – రాతపరీక్ష ఆధారంగా

పరీక్ష విధానం – మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడగగా.. మిగతా 20 మార్కులు ఇంగ్లీష్, జనరల్ అవర్ నెస్, తెలంగాణ సంస్కృతితో పాటు పలు అంశాల నుంచి అడుగుతారు.

ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు తుది గడువు – 29.10.2023

దరఖాస్తు సవరణకు అవకాశం: 01.11.2023

హాల్‌టికెట్లు: పరీక్షకు 7 రోజుల ముందు

ఎగ్జామ్ నిర్వహించే తేదీ: 3.12.2023

అధికారిక వెబ్ సైట్ – https://tsgenco.co.in/TSGENCO/home.do

మరోవైపు 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ జెన్‌కో‌. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబరు 29వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. హాల్ టికెట్లను పరీక్షకు ఏడు రోజుల ముందు విడుదల చేస్తామని జెన్ కో వెల్లడించింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *