Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 08 అక్టోబరు 2023 ఆదివారం

 Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 08 అక్టోబరు 2023 ఆదివారం

Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 08 అక్టోబరు 2023 ఆదివారం కోసం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 08. 10.2023, వారం: ఆదివారం, తిథి : నవమి, నక్షత్రం : పుష్యమి, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

1. మేషం రాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు సత్‌ఫలితాలిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. క్రీడాకారులు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. విద్య, ఉద్యోగాన్వేషణలో ముందడుగు వేస్తారు. మేషరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం మరియు సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని తెలియ చేస్తున్నాను.

2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు రావు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిళ్ళు అధికము. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురవ్వవచ్చు. ఆస్తుల వ్యవహారాల్లో సోదరులతో విభేదించవచ్చు. సన్నిహితులతో అకారణంగా గొడవలు ఏర్పడును. విద్యార్థులకు మధ్యస్థం. కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తారు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

3.మిథునం రాశి ఫలాలు 2023

మిథునరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు తొలగుతాయి. వాహనాలు, స్థూలు కొనుగోలు ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూలం. ప్రముఖుల పరిచయం. అదనపు రాబడి ఉంటుంది. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. అధిక ఖర్చుల వలన అప్పులు పెరుగును. వ్యాపారులకు వ్యాపారం అంత లాభసాటిగా ఉండదు. ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు ఏర్పడును. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత పాటించాలి. విద్యార్థులకు విద్యావకాశాలు చేజారవచ్చు. ఒక సమాచారం గందరగోళం సృష్టించవచ్చు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

5.సింహం రాశి ఫలాలు 2023

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆస్తి విషయంలో తండ్రి తరపు వారితో వివాదాలేర్చడును. ఇంటి నిర్మాణాల్లో జాప్యం. ముఖ్య కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విఖేదిస్తారు. ఖర్చులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీల్లో హామీలు మంచిది కాదు. ధనలాభం కలుగును. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి విముక్తి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళ నుండి ఉపశమనం. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభించవచ్చు. తండ్రి తరపున ఆస్తి లేదా ధనలాభ సూచనలు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

7.తులారాశి రాశి ఫలాలు 2023

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఊహించని హోదాలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గతంలో చేజారిన ఆస్తులు తిరిగి దక్కించుకుంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు. అనుకున్న కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. కొన్ని విషయాలలో జోక్యం వలన చిక్కులు ఎదురు కావచ్చు. మీపై ఉంచిన బాధ్యతల నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతారు. తరచూ ప్రయాణాలు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి విషయాలలో కుటుంబ సభ్యులతో విఖేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపరచుకోండి. వ్యాపారాలు కొంత మెరుగుపదే అవకాశం. ఉద్యోగులకు నిరుత్సాహం. ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు. రావలసిన డబ్బు అందే సూచన. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉ ద్యోగులకు అనుకోని హోదాలు. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. కుటుంబ సమస్యలు తీరుతాయి. మీ ఆశయాలు నెరవేరేందుకు మిత్రులు సహకరిస్తారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సంతానంలో ఒకరికి విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారస్తులకు తగిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, కళాకారులకు ఊహించని సన్మానాలు. వాహన సౌఖ్యం. కార్యక్రమాలు అనుకున్న మేరకు సాగుతాయి. వాహనాలు, ఇళ్ళ కొనుగోలు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. భూములు, వాహనాలు కొనుగులు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో పురోగతి. ముఖ్య కార్యక్రమాలు విజయవంతం. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. సంతానపరంగా చిక్కులు తొలగుతాయి. మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అందే అవకాశం. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారాలలో లాభాలు కలుగును. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

===========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *