Siddipet To Hyderabad: నేటి నుంచి సిద్ధిపేట సికింద్రాబాద్ రైలు.. నెరవేరిన దశాబ్దాల కల
Oct 03, 2023 06:36 AM IST
Share on Twitter
Share on Facebook
Share on Whatsapp
మమ్మల్ని ఫాలో అవ్వండి
Siddipet To Hyderabad: సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు ప్యాసింజర్ రైలు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు మొదటి రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో దశాబ్దాల కల నేటితో నిజం కానుంది.
Siddipet To Hyderabad: సిద్దిపేట జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్న వేళ రానేవచ్చింది. దశాబ్దాల కల నెరవేరుస్తూ సిద్ధపేట నుంచి ప్రయాణికుల రైలు పరుగులు తీయనుంది. దీంతో నర్సాపూర్ రైల్వేస్టేషన్లో సందడి నెలకొంది. రైల్వేస్టేషన్ బోర్డు వద్ద స్థానికులు సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేశారు. తొలి రైలు కూత కోసం ఇప్పటికే స్టేషన్‌ను ముస్తాబు చేశారు. నిజామాబాద్ నుంచి ప్రధాని మోదీ నరేంద్రమోదీ తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు.
సిద్దిపేట(నర్సాపూర్) రైల్వేస్టేషన్లో మంత్రి హరీశ్‌రావు మధ్యాహ్నం 3 గంటలకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరైలు(07706) సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. బుధవారం నుంచి సిద్దిపేట-సికింద్రాబాద్ మార్గాల్లో రెండు సార్లు రైలు రాకపోకలు సాగించనుంది.అక్టోబర్ 3 మంగళవారం నుంచి సిద్దిపేట -సికింద్రాబాద్ మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 3వ తేదీ నుంచి సిద్దిపేట- నుంచి -సికింద్రాబాద్ మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
టైమింగ్స్ ఇవే..
07483 నెంబర్ గల ప్యాసింజర్ రైలు..సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో 07484 నెంబర్ గల రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి..సాయంత్రం 5.10గంటలకు సికింద్రాబాద్‌కు చేరనుంది. సాయంత్రం 5.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న రైలు.. సిద్ధిపేటకు రాత్రి 8.40 గంటలకి చేరుకుటుంది.