PM Modi Nizamabad Tour Live Updates: నేడు నిజామాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ

 PM Modi Nizamabad Tour Live Updates: నేడు నిజామాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi Nizamabad Tour Live Updates: నేడు నిజామాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటనలో మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైలు మార్గం ప్రారంభిస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు మార్గాల విద్యుదీకరణను జాతికి అంకితం చేయనున్నారు.
Tue, 03 Oct 202307:14 AM IST
ఢిల్లీ నుంచి బీదర్‌ ఎయిర్‌పోర్టుకు ప్రయాణం

మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాఫ్టర్‌లో నిజామాబాద్ వస్తారు. మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు ఎంఐ-17 సైనిక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు

Tue, 03 Oct 202307:13 AM IST
రైల్వే లైన్లు, రైళ్ల ప్రారంభోత్సవం

రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవున నిర్మించిన సిద్దిపేట-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను, సిద్దిపేట-సికింద్రాబాద్‌ వరకు తొలి రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.’ధర్మాబాద్‌ మహారాష్ట్ర)-మనోహరాబాద్‌- మహబూ బ్‌నగర్‌-కర్నూల్‌ (ఏపీ)’ రైల్వే లైన్‌లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేస్తారు.

Tue, 03 Oct 202307:12 AM IST
రామగుండం థర్మల్ ప్లాంట్ జాతికి అంకితం

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌’ కింద రూ.516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు శంకుస్థాపన చేస్తారు.

Tue, 03 Oct 202307:11 AM IST
8వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

నిజామాబాద్‌ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Tue, 03 Oct 202307:11 AM IST
తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నాలు

నిజామాబాద్‌ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ విమర్శలతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మరింత పట్టుపెంచుకునే దిశ గా నిజామాబాద్‌లో సభ, ప్రధానితో వరాల ప్రకటించే అవకాశాలున్నాయి.

Tue, 03 Oct 202307:09 AM IST
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టార్గెట్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలమూరు ప్రజాగర్జన సభలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. ప్రధాని మోదీ పాలమూరు సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న సాయాన్ని వివరించారు. రూ.13,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనితోపాటు రాష్ట్రంలోని అధికార పార్టీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. నేడు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు.

Tue, 03 Oct 202307:08 AM IST
మూడు రోజుల్లో రెండోసారి పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విద్యుత్, రైల్వే, ప్రజారోగ్యానికి సంబంధించి రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Tue, 03 Oct 202307:07 AM IST
నిజామాబాద్‌లో ప్రధాని పర్యటన

నేడు నిజామాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటనలో మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైలు మార్గం ప్రారంభిస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు మార్గాల విద్యుదీకరణను జాతికి అంకితం చేయనున్నారు. సిద్దిపేట-సికింద్రాబాద్ తొలి రైలు సర్వీసును ప్రారంభించనున్నారు. రూ.8వేల కోట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటును ప్రారంభిస్తారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *