Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరికి శుభ యోగాలు ఉన్నాయి

 Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. వీరికి శుభ యోగాలు ఉన్నాయి

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 28.09.2023 గురువారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 28.09.2023

వారం: గురువారం, తిథి: చతుర్దశి,

నక్షత్రం : పూర్వాభాద్ర, మాసం: భాద్రపదం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు

1.మేషరాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. మీరు చేసే పనుల్లో అలసటకు గురవుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబములో సమస్యలు, ఇబ్బందులు కలుగును. మీయొక్క ఆలోచనా విధానంతో మీ సమస్యలను అధిగమిస్తారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి..
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా శుభయోగాలున్నాయి. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. పెద్దల ప్రశంసలు పొందుతారు. మొహమాటం కారణంగా శ్రమ పెరుగుతుంది. మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలుంటాయి. అలాంటి సందర్భాల్లో తెలివిగా ప్రవర్తిస్తే మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పనులో సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రుల సాయంతో ఆర్థిక నష్టాన్ని నివారిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. బలమైన ప్రయత్నంతో అభివృద్ధిని సాధిస్తారు. తొందరపడి మాట్లాడితే, ఇతరులు అపార్ధం చేసుకునే ప్రమాదం ఉన్నది. ఆధ్యాత్మికంగా మంచి సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేసే పనుల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. వ్యతిరేక పరిస్థితులున్నాయి. సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరాలకు సాయపడే వారున్నారు. అనారోగ్యం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. శివపార్వతులు అర్ధ నారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి
==========================================================================
సింహరాశి ఫలాలు 2023

సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. శుభవార్తలు వింటారు. ఆవేశకావేశాలకు దూరంగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ ఆలోచన విధానంలో మార్చు వస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. శత్రుపీడ తొలగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. శుభవార్త వింటారు. కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. శుభయోగం ఉన్నది. భగవదనుగ్రహంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. కష్టపడితే విజయం అందుకుంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శివపార్వతులు అర్ధ నారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. పెద్దల మాటలు ప్రేరణనిస్తాయి. ఆర్ధికంగా శక్తివంతులవుతారు. విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందూ వినోదాలతో గడుపుతారు. మీ తెలివితేటలతో విజయాన్ని అందుకుంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారం లాభదాయకముగా ఉంటుంది. భూలాభమున్నది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కొత్త వస్తువులు కొంటారు. పెద్దల ఆదరాభిమానాలున్నాయి. వృథా ప్రయాణాలుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. ఎవరినీ విమర్శించరాదు. వ్యతిరేకంగా మాట్లాడేవారున్నారు జాగ్రత్త. ప్రమాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలించును. ప్రయాణాలు కలసివస్తాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. పట్టుదల అవసరం. ధర్మచింతనతో వ్యవహరించాలి. గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. శుభ ఫలితాలు కలుగుతాయి.
=========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. శ్రమ అవసరం. ఆర్ధిక విజయం. శక్తివంచన లేకుండా పనిచేయండి. సంతృప్తికర ఫలితాలుంటాయి. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. శుభాయోగాలున్నాయి. విందూ వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఏ విషయంలోను అశ్రద్ధ వద్దు. కొన్ని పొరపాట్లు జరిగే ఆస్మారం లేకపోలేదు. నిర్ణయాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. అంతా శుభమే జరుగుతుంది. ధైర్యం, ఏకాగ్రత రెండూ ముఖ్యం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి.
===========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *