Bigg Boss 7 Telugu Vote: టాప్‍లో దూసుకెళ్తున్న ఊహించని కంటెస్టెంట్స్.. ఆ ఎపిసోడ్ ఎఫెక్ట్, అతను బ్యాగ్ సర్దుకోవాల్సిందే!

 Bigg Boss 7 Telugu Vote: టాప్‍లో దూసుకెళ్తున్న ఊహించని కంటెస్టెంట్స్.. ఆ ఎపిసోడ్ ఎఫెక్ట్, అతను బ్యాగ్ సర్దుకోవాల్సిందే!

Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నాలుగో వారం ఓటింగ్‍లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ టాప్‍లో ఉన్నారు. సెప్టెంబర్ 27వ తేది ఒక్క ఎపిసోడ్‍తో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. నామినేషన్లలో ఆరుగురు ఉండగా.. వారికి నమోదైన ఓట్లు పరిశీలిస్తే..
Bigg Boss 7 Telugu 4th Week Voting Result: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్‍లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి సోమవారం (సెప్టెంబర్ 25) , మంగళవారం (సెప్టెంబర్ 26) రెండు రోజులు నామినేషన్స్ జరిగాయి. ఇందులో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు.

మూడో వారం నుంచి
బిగ్ బాస్ 7 తెలుగు నాలుగో వారంలో ప్రియాంక జైన్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ నామినేట్ అయ్యారు. వీరికి ఓట్లు వేసేందుకు మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ పోల్ నిర్వహించారు. వీరిలో అధికంగా ఓట్లతో కండలవీరుడు ప్రిన్స్ యావర్ ఉన్నాడు. అతనికి మూడో వారం నుంచి ఓట్ బ్యాంక్ పెరుగుతూ వస్తోంది. ఇక రెండో స్థానంలో మరో బాడీ బిల్డర్, డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఉన్నాడు.

కరెక్ట్ అయినా
గౌతమ్ గేమ్, స్ట్రాటజీస్ చాలా బాగున్నప్పటికీ కంటెస్టెంట్స్ లో అతనిపై చులకన భావం ఉండేది. ఇక గౌతమ్ తడబాటు తనంతో పాయింట్స్ కరెక్ట్ అయినా ఎఫెక్టివ్‍గా అనిపించకపోయేది. అలాంటి గౌతమ్ కృష్ణ ఒక్క ఎపిసోడ్‍తో ఓటింగ్స్ లెక్కలు మార్చేశాడు. నామినేషన్స్ సమయంలో గౌతమ్ పాయింట్స్ బాగుండటం, అతనికి జ్యూరి సభ్యులు అన్యాయం చేయడం ప్లస్ అయింది. అలాగే సెప్టెంబర్ 27వ ఎపిసోడ్‍లో స్మైల్ ఫొటో టాస్కులో అదరగొట్టాడు. దీంతో అతనికి ఓట్ బ్యాంక్ పెరిగింది.

ఓటింగ్ లెక్కలు
అంతేకాకుండా అమర్, ప్రశాంత్, శివాజీ నామినేషన్లలో లేకపోవడం కూడా ప్లస్ అయింది. వారు ఉంటే ఓటింగ్ లెక్కలు మరోలా ఉండేవి. కాగా ప్రిన్స్ యావర్‍ 29.2 శాతంతో ఫస్ట్ ప్లేస్, 18.6 శాతంతో గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రియాంకకు 17.55 శాతం, శుభ శ్రీ రాయగురు 15.29 శాతం ఓట్లతో నాలుగో స్థానం, 10.84 శాతంతో ఐదో స్థానంలో రతిక రోజ్, 8.52 శాతంతో టేస్టీ తేజ చివరి స్థానంలో ఉన్నారు. వీరిలో తేజ, రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అతనే ఎలిమినేట్
అయితే చాలా మంది ఆడియెన్స్ దృష్టిలో రతికను ఎలిమినేట్ కావాలని ఉంది. పోల్స్, బిగ్ బాస్ 7 తెలుగు ఎపిసోడ్స్ ప్రోమో కామెంట్స్ లలో రతికను ఎలిమినేట్ చేయాలని చాలామంది కోరుకుంటున్నా.. ఆమె బిగ్ బాస్ ముద్దు కాబట్టి.. తేజనే ఎలిమినేట్ (Bigg Boss 7 Telugu Fourth Week Elimination) అయ్యే ఛాన్స్ అధికంగా ఉంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *