Nara Lokesh On CM Jagan : జైలు మోహన్… బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు

 Nara Lokesh On CM Jagan : జైలు మోహన్… బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు

Nara Lokesh On CM Jagan: సీఎం జగన్ పై నారా లోకేశ్ సీరియస్ ట్వీట్ చేశారు. “జైలు మోహన్‌కు బెయిల్‌ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వేదికగా మక్కాం వేశారు. పలు పార్టీల నేతలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ… లోకేశ్ సీరియస్ ట్వీట్ చేశారు.

బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు జైలు మోహ‌న్. 42 వేల కోట్లు ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైలులో ఉన్నారు” అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు ఓ ఫొటోను కూడా జత చేశారు.

చంద్రబాబు విచారణ ప్రారంభం…
మరోవైపు రాజమండ్రి జైలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.12 మంది సభ్యుల సీఐడీ బృందం విచారిస్తోంది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో ఈ విచారణ కొనసాగుతోంది. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు విరామం కూడా ఇస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటల తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.

ఇవాళ, రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు విచారణ జరగనుంది. శనివారం సాయంత్రం 5 గంటల వరకూ ప్రశ్నించనున్నారు. మధ్యలో ఓ గంట భోజనం కోసం విరామం ఇస్తారు. డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ ప్రక్రియ జరుగుతుంది. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని… ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను పాటింస్తూ సీఐడీ విచారణ ప్రక్రియలో ముందుకెళ్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *