Rahul Sipligunj : ఫేక్ సింపతీ ఎంతవరకు.. బిగ్ బాస్ రతికపై మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్

 Rahul Sipligunj : ఫేక్ సింపతీ ఎంతవరకు.. బిగ్ బాస్ రతికపై మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్

Bigg Boss 7 Telugu Rathika Rahul Sipligunj: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మల్లో రతిక రోజ్ ఒకరు. తొలి రోజు నుంచే గేమ్ డిఫరెంట్‍గా ఆడుతున్న రతికపై ఆమె ఎక్స్ బాయ్‍ఫ్రెండ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ పోస్ట్ వదిలాడు.

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి మొత్తంగా 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టగా.. వారిలో అందమైన ముద్దుగుమ్మ రతిక రోజ్ ఒకరు. పటాస్ ప్రియ అయిన ఈ బ్యూటి మోడలింగ్‍లోకి రతిక రోజ్‍గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో కంటెస్టెంట్‍గా అలరిస్తోంది. హౌజ్‍లో మొదట గేమ్‍తో ఆకట్టుకున్న రతిక రోజ్ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు కాస్తా చిరాకు పడేలా చేస్తుంది. ప్రశాంత్‍కు దెబ్బేసిన రతిక ఇప్పుడు ప్రిన్స్ యావర్‍తో మరో ట్రాక్ నడిపిస్తోంది.

మాజీ ప్రియుడి గురించి
ఇదిలా ఉంటే రతిక రోజ్ బిగ్ బాస్ హౌజ్‍లోకి ఎంట్రీ కాగానే ఆమె బాయ్‍ఫ్రెండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరికి బ్రేకప్ అయిందని, రతిక మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అని టాక్ నడిచింది. అయితే, హౌజ్‍లో అప్పుడప్పుడు తన ఎక్స్ బాయ్‍ఫ్రెండ్ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది రతిక. సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‍లో కూడా హీరో శివాజీతో తన ఎక్స్ బాయ్‍ఫ్రెండ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చింది.

ఇతరులపై ఆదారపడి
తాజాగా రతిక రోజ్‍ గేమ్‍పై రాహుల్ సిప్లిగంజ్ పేరు చెప్పకుండా షాకింగ్ పోస్ట్ పెట్టాడు. “ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటివరకు? ప్రజలు ఎప్పుడూ తమ సొంత టాలెంట్‍ను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రం నిత్యం ఇతరుల టాలెంట్, పేరుపై ఆధారపడుతుంటారు. అదే విషయాన్ని కొంతమంది నిరూపిస్తారు కూడా. ఫేమ్ కోసం అవసరానికి కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. నీ లోపల ఉన్న మనిషికి ఆల్ ది బెస్ట్. అలాగే పైసలు (డబ్బులు) తీసుకున్న టీమ్‍కు కంగ్రాట్స్” అని రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *