Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ చీటింగ్.. డాక్టర్ బాబుకు దెబ్బ.. వాళ్లను గెలిపించేదుకే బిగ్ ప్లాన్

 Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ చీటింగ్.. డాక్టర్ బాబుకు దెబ్బ.. వాళ్లను గెలిపించేదుకే బిగ్ ప్లాన్

Bigg Boss 7 Telugu Gautham Krishna: అందరికీ పెద్ద దిక్కుగా న్యాయం చెప్పే బిగ్ బాస్ సైతం తనకు నచ్చినవాళ్లను గెలిపించడం కోసం జెన్యూన్ కంటెస్టెంట్లను బలి చేస్తుంటాడు. ఇది బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో మరోసారి ప్రూవ్ అయింది.
Bigg Boss 7 Telugu Episode 19: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో 3వ పవరాస్త్ర గెలుచుకునేందుకు కంటెండర్లుగా డిఫెండ్ చేసుకునేందుకు అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‍లకు బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఎపిసోడ్‍లో (సెప్టెంబర్ 21) శోభా శెట్టికి అత్యంత కారమైన 45 చికెన్ లెగ్ పీస్‍లు తినాల్సిందిగా టాస్క్ ఇచ్చాడు. ఆమె మొత్తానికి 27 లెగ్ పీస్‍లు తింది. ఆమె కంటే తక్కువ సమయంలో 27 కంటే ఎక్కువ చెకెన్ పీసెస్ తిన్నవాళ్లు గెలిచినట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు.

27 లెగ్ పీసెస్
శోభా శెట్టికి వ్యతిరేకంగా నామినేట్ చేసిన గౌతమ్, ప్రశాంత్, శుభ శ్రీ పోటీలోకి దిగారు. అందరికంటే ముందుగా గౌతమ్ 28 లెగ్ పీసెస్ తినేశాడు. అక్కడ గౌతమే ముందుగా తిన్నాడు అని అతన్ని విజేతగా ప్రకటించాడు సంచాలక్ సందీప్. కానీ, తర్వాత నువ్ తిన్నప్పుడు చిన్నముక్క మిగిలిపోయింది. దాన్ని వదిలేశావ్ కాబట్టి నువ్ తిన్నది 27 పీసెస్ అని చెప్పాడు. దానికి అది నువ్ అక్కడే చెప్పాలి కదా. చెప్పి ఉంటే బెల్ కొట్టడానికి ముందే తినేసేవాడిని అని గౌతమ్ వాదనకు దిగాడు.

కావాలనే ప్లాన్
గౌతమ్ ప్రశ్నలకు సందీప్ ఏవేవే కారణాలు చెప్పాడు. అనతరం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. శోభా తిన్నది 27 పీసెస్ కాబట్టి.. దాన్ని బీట్ చేయాలంటే 28 తినాలి. గౌతమ్ 27 తిన్నాడు కాబట్టి శోభా శెట్టిదే గెలుపు అని పెద్దయ్య అనౌన్స్ చేశాడు. దీంతో జెన్యూన్‌‍గా ఆడి గెలిచిన డాక్టర్ బాబు గౌతమ్‍కు పెద్ద దెబ్బ వేసినట్లు అయింది. అయితే, ఇదంతా బిగ్ బాస్ కావాలనే ప్లాన్ చేస్తున్నాడని పలువురు రివ్యూవర్లు చెబుతున్నారు.

అమ్మాయి మాత్రమే
మూడో పర్మనెంట్ ఇంటి సభ్యుడిగా అమ్మాయిలను ఉంచాలనే బిగ్ బాస్ బిగ్ స్కెచ్ వేశాడని టాక్. అందుకే ప్రిన్స్ యావర్‍కు సైతం ఘోరమైన టాస్క్ ఇచ్చి తప్పిద్దామనుకున్నాడు. కానీ, అతని చాలా స్ట్రాంగ్ అవ్వడంతో తప్పించలేకపోయాడు. ఇక చికెన్ టాస్క్ లో శోభా కంటే కొంచెం ముక్క తగ్గిందన్న కారణంతో ఫాస్ట్ గా తిన్నాడని కూడా చూడకుండా తప్పించేశాడు. అలాగే అమర్ దీప్‍ చేయడానికి వీళ్లేని గుండు టాస్క్ ఇచ్చాడు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *