Shobha Shetty: మంట తట్టుకోలేకపోయిన మోనిత.. గదిలో ఉక్కిరిబిక్కిరి.. ఆ టార్చర్‍తో కన్నీళ్లు

 Shobha Shetty: మంట తట్టుకోలేకపోయిన మోనిత.. గదిలో ఉక్కిరిబిక్కిరి.. ఆ టార్చర్‍తో కన్నీళ్లు

Bigg Boss 7 Telugu Shobha Shetty: బిగ్ బాస్ 7 తెలుగు రోజురోజుకీ మరింత జోరుగా వినోదాన్ని పంచుతోంది. గత ఎపిసోడ్‍లో ప్రిన్స్ యావర్‍కు కంటెస్టెంట్స్ చుక్కలు చూపిస్తే.. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 21 ఎపిసోడ్‍లో శోభా శెట్టి ఉక్కిరిబిక్కిరి అయింది. మంట తట్టుకోలేక ఏడ్చేసింది.

Bigg Boss 7 Telugu September 21st Episode Promo: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‍లో ప్రస్తుతం మూడో పవరాస్త్ర కోసం చర్చలు సాగుతున్నాయి. బిగ్ బాస్ శోభా శెట్టి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్‍ను కంటెండర్లుగా సెలెక్ట్ చేయగా.. మిగతా కంటెస్టెంట్స్ తిరస్కరించారు. దీంతో బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 20వ తేది ఎపిసోడ్‍లో తను అర్హుడని నిరూపించుకునేందుకు ప్రిన్స్ యావర్‍కు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అందులో దామిని, రతిక, టేస్టీ తేజ చుక్కలు చూపించిన తాను అర్హుడని నిరూపించుకున్నాడు ప్రిన్స్.

కన్ఫెషన్ రూమ్‍లో
ఇక ఇప్పుడు శోభా శెట్టి వంతు వచ్చింది. ఆమె కంటెండర్‍కు అర్హురాలని నిరూపించుకునేందుకు అత్యంత కారంగా ఉన్న చికెన్ తినే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మీలో గెలవాలని ఉన్న ఆకలిని నిరూపించుకునేందుకు సమయం ఇది అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో కారంగా ఉన్న చికెన్ తినేందుకు రెడీ అయింది కార్తీక దీపం మోనిత. కొన్ని పీసెస్ తినేసరికి శోభా శెట్టికి కారం మంట ఎక్కువైంది. ఆ మంట తట్టుకోలేక కన్ఫెషన్ రూమ్‍లో శోభా ఉక్కిరిబిక్కిరి అయింది.

నోట్లో టిష్యూ పేపర్స్
చికెన్ కారానికి పూనకం వచ్చినట్లు ఊగిపోయింది శోభా శెట్టి. నా లైఫ్‍లో ఇంత కారం తినలేదు బిగ్ బాస్ అంటూ తల పట్టుకుని టేబుల్‍పై పడిపోయింది. చికెన్ ఘాటుకు ఏడుస్తూ చేతితో నేలను కొట్టింది. మమ్మీ అంటూ ఏడుస్తూ.. తనకు మాటిచ్చిన విషయం చెబుతూ కంట్రోల్ చేసుకుంది. కారం ఘాటుకు ఏం చేయలేక.. టిష్యు పేపర్లను నోట్లో పెట్టుకుంది శోభా శెట్టి.

శోభా స్థానంలో
అనంతరం శోభా శెట్టిని కంటెండర్‍కు అనర్హురాలని చెప్పిన శుభ శ్రీ, గౌతమ్, ప్రశాంత్‍ను కన్ఫెషన్ గదిలోకి పిలిచాడు బిగ్ బాస్. బౌల్‍లో ఉన్న మొత్తం చికెన్‍ను ముందుగా ఎవరు తింటే.. శోభా శెట్టి స్థానంలో వాళ్లు కంటెండర్ అవుతారని పెద్దయ్య చెప్పాడు. దీంతో ముగ్గురు ఈ చికెన్ లాగించడం మొదలు పెట్టారు. దానికి సందీప్ సంచాలక్‍గా ఉన్నాడు. ప్రశాంత్ తినడం చూసి.. వాడు తినేస్తాడని చెప్పాగా అని శోభా అంది. ఇలా ప్రోమోను ముగించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *