బస్సు యాత్రకు కాంగ్రెస్ రెడీ ! ప్లానేంటంటే… ?

 బస్సు యాత్రకు కాంగ్రెస్ రెడీ ! ప్లానేంటంటే… ?

అనూహ్యంగా కలిసి వచ్చిన పరిణామాలతో మరింత దూకుడు ప్రదర్శించాలని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నిర్ణయించుకుంది.దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించి,  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు , ప్రజల దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ముందుగా ఉత్తర తెలంగాణ నుంచి రాష్ట్రమంతా సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేయబోతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

త్వరలోనే తేదీలను ప్రకటించనున్నారు.

ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క, ( Mallu Bhatti Vikramarka ) టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు.నిన్న జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ ఉండడంతో కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ( Revanth Reddy )ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి మధ్యలోనే పార్లమెంటుకు వెళ్లిపోయారు.

దీంతో ఈ వివరాలను మల్లు భట్టు విక్రమార్క వెల్లడించారు.ఈరోజు మరోసారి దీనిపై సమావేశం అవుతామని వారు తెలిపారు.తెలంగాణలో ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలను క్రోడీకరించి అభ్యర్థుల ఎంపికను పూర్తిచేస్తామని వారు వెల్లడించారు.

దూరమైన వర్గాలన్నిటిని కాంగ్రెస్ కు దగ్గర చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని,  పోటీ చేస్తామన్న వారందరికీ టికెట్లు ఇవ్వలేమని,  వామపక్షాలతో జాతీయస్థాయిలో నేతలు చర్చలు జరుపుతారని , వారితో ఒక అవగాహన వచ్చిన తర్వాత మరింత ముందుకు వెళ్తామని ఈ సమావేశంలో వెల్లడించారు.ఇక బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ కు జనాల్లో ఆదరణ పెంచడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.ప్రస్తుతం అధికార పార్టీ బీ ఆర్ ఎస్ ( BRS )కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కావడంతో ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం ప్రజల్లోనే ఉండేవిధంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది.

ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ కు ఆదరణ పెంచడంతో పాటు , పార్టీ శ్రేణుల్లోను ఉత్సాహం పెరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *