రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..!!

 రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Monsoon Sessions ) ప్రారంభం కానున్నాయి.సెప్టెంబర్ 21వ తారీకు గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ సమావేశాలలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలు ఢీ అంటే ఢీ అనే రీతిలో…టీడీపీ.

వైసీపీ పార్టీలు వ్యవహరించడానికి రెడీ కాబోతున్నాయి.ఇదిలా ఉంటే చంద్రబాబు హయాంలో జరిగిన స్కాం లపై.సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు అక్రమమని.

చట్టసభలలో తమ గళం వినిపించడానికి.టీడీపీ నేతలు( TDP Leaders ) సైతం  సిద్ధమవుతున్నారు.

అంతేకాకుండా జరగబోయే ఈ సమావేశాలలో ఉద్యోగులకు సంబంధించిటీవల తీసుకున్న నిర్ణయాలను బిల్లు రూపంలో ప్రవేశపెట్టి చట్ట సవరణలు చేయనున్నట్లు సమాచారం.వ్యవసాయ ఉత్పత్తులకి కనీస మద్దతు ధర కల్పించేందుకు ఒక ప్రత్యేకమైన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడానికి నిర్ణయించింది.

ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించి ఇతర అంశాలపై కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *