గణపతి శరీర భాగాలు.. మనిషి జీవిన విధానం
Browse high resolution stock images of Lord Ganesha in Kolkata, WB, India
ఆదిపూజ్యుడు గణపతి శరీర పరిమాణం కూడా మన జీవితానికి సంబంధించిన ఆనందానికి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. గణపతి శరీరం నుండి మనిషి కొన్ని విషయాలను నేర్చుకోవాలని పెద్దలు సూచిస్తారు.
భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి వస్తుందంటే చాలు.. దేశ్యవ్యాప్తంగా గణపతి భక్తుల సందడి మొదలవుతుంది. విఘ్నాలకు అధిపతి గణపతి పూజకు సిద్ధమవుతారు. గణేశ చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడని హిందువుల నమ్మకం. వినాయక చవితి నుంచి దేశ వ్యాప్తంగా పది రోజులపాటు పండగను జరుపుకుంటారు. ఈ 10 రోజులు గణపతి భూమిపై ఉంటాడని నమ్మకం. ప్రతి వ్యక్తి గణపతిని పూజించి ఉపవాసం ఉండి.. కోరుకున్న వరం పొందాలని కోరుకుంటారు. ఆదిపూజ్యుడు గణపతి శరీర పరిమాణం కూడా మన జీవితానికి సంబంధించిన ఆనందానికి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. గణపతి శరీరం నుండి మనిషి కొన్ని విషయాలను నేర్చుకోవాలని పెద్దలు సూచిస్తారు.
1. గజాననుడి చిన్న కళ్ళు గణపతిది భారీ శరీరం. చిన్న కళ్ళు.. అంటే.. మన జీవితంలో చిన్న చిన్న విషయాలను తక్కువ అంచనా వేయవద్దని గజాననుడి చిన్న కళ్ళు మనకు బోధిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్నీ గణపతి చిన్న కళ్ళు నేర్పుతాయి.
2. గజాననుడి పెద్ద చెవులు పెద్ద చెవులు ఉన్నవారు అదృష్టవంతులని నమ్మకం. గణపతి పెద్ద చెవులు జీవితంలో ప్రతి ఒక్కరూ చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం.. వాటిల్లో సరైన వాటిని స్వీకరించడం.. చెడు విషయాలను మనసు నుంచి తొలగించడం వంటివి నేర్పుతాయి.
3. గజాననుని పెద్ద బొడ్డు గణపతి లబోధరుడు.. కడుపు చాలా పెద్దది. పొట్ట భారీగా ఉండడం వల్ల గణేశుడిని లంబోదరుడు అని కూడా అంటారు. గణపతి కడుపు పరిమాణం ప్రతి చిన్న, పెద్ద.. మంచి చెడులను జీర్ణించుకోవడం నేర్పుతుంది. గణపతి పెద్ద బొడ్డు కూడా శ్రేయస్సు కి చిహ్నంగా పరిగణించబడుతుంది.
4. గజాననుని తల విఘ్నలకధిపతి గణపతి తల ఏనుగు. గజాననుడి పెద్ద తల మనకు జీవితంలో అన్ని కోణాల్లో ఆలోచించడం నేర్పుతుంది. జంతువులలో ఏనుగు అత్యంత తెలివైనది. అటువంటి పరిస్థితిలో, జీవితంలో పెద్ద లక్ష్యాన్ని కలిగి ఉండాలని గణపతి పెద్ద తల నుండి మనిషి నేర్చుకోవాలి
5. గజాననుని తొండం గణపతి పొడవైన తొండం మనిషి దూరదృష్టితో ఉండాలని.. ఓంకార స్వరూపమని సూచిస్తుంది. తొండం ఎంత దూరమైన వాసనను వెదజల్లగలదో, అదే విధంగా.. మనిషి అప్రమత్తంగా ఉంటూ జీవితంలోని ప్రతి మంచి చెడులను ముందుగానే చూసేందుకు ప్రయత్నించాలని భావిస్తారు .
6. గజాననుని వాహనం హిందూ మతంలో ఎలుకను గణపతి వాహనంగా పరిగణిస్తారు. గజాననుడి భారీ శరీరంతో పోల్చితే వాహనం రూపంలో ఉన్న ఎలుక చిన్న ప్రాణి. మనం ఎంత పెద్దవారైనా సరే, ఖర్చులను పరిమితిలో ఉంచుకోవాలని .. దుబారాకు దూరంగా ఉండాలని నేర్పుతుంది.