పశ్చిమగోదావరి భీమవరంలో లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత..!!
టీడీపీ యువ నేత నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) ప్రస్తుతం పశ్చిమగోదావరి భీమవరంలో( Bhimavaram ) సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాదయాత్రలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
భీమవరం ప్రకాశం చౌక్ లో వైసీపీ ఏర్పాటు చేసిన హోర్డింగ్ నీ తొలగించడానికి లోకేష్ అనుచరులు ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది.వైసీపీ.
టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
భీమవరంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం లోకేష్ పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ వైపు చేరుకోగానే రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.అనంతరం ఇరువర్గాలు కర్రలతో రాళ్లతో దాడులు చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో పాదయాత్రలో వాహనాల అద్దాలు ధ్వంసం కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు( TDP ) వైసీపీ( YCP ) ఫ్లెక్సీలను చించేశారు.
అల్లర్లను ఆపడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులకు కూడా గాయాలు కావటం జరిగింది.ఆ తర్వాత పోలీసులు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు.