జమిలీకి వైసీపీ సై ! గెలుపుపై సమీక్ష

ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో కేంద్రం ముందడుగు వేస్తుంది.ఎప్పటి నుంచో జమిలి ఎన్నికలపై కేంద్ర అధికార పార్టీ బిజెపి అనేక ప్రకటనలు చేస్తూనే ఉంది.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కలిగే ప్రయోజనాలను హైలెట్ చేస్తూ, జమిలి ఎన్నికలకు వెళ్ళబోతున్నామనే సంకేతాలు ఎప్పటి నుంచో ఇస్తోంది.అయితే అది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో , దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు అన్ని పరిగణలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం ముందడుగు వేస్తోంది.

ఇప్పటికే అనేక పార్టీలు జమిలి ఎన్నికలపై సానుకూలంగా ఉండగా, మరికొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇక ఏపీ విషయానికొస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఇప్పటికే ప్రకటించారు.

ఏపీలో ముందస్తు ఎన్నికల కోసం జగన్ కసరత్తు చేస్తున్నారని,  ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అంటూ టిడిపి( TDP ) పదేపదే ప్రచారం చేస్తుంది .ఇక జనసేన కూడా ఇదే అంశంపై వైసిపి టార్గెట్ చేసుకుంది.ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన కూడా తమ పార్టీ లీడర్ల కు చెబుతూనే వస్తోంది.

అయితే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో లేమని వైసిపి కూడా ప్రతి సందర్భంలో ఖండిస్తూనే వస్తుంది.ఇక ఇప్పుడు కేంద్రం తీసుకున్న జమిలి ఎన్నికలపై ఏపీ అధికార పార్టీ వైసిపి సానుకూలంగానే ఉన్నట్లు తెలిపింది .లోక్ సభ తో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే ఏపీ ప్రభుత్వం కూడా దానికి అంగీకారం తెలపనన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.దేశవ్యాప్తంగా జమిని ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతుంది.

ఇప్పటికే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణ , జమిలి సాధ్య సాధ్యనాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో వేసిన కమిటీతో జమిలి ఎన్నికలు తప్పవు అనే చర్చ జరుగుతుంది.జమిలి ఎన్నికల పై ఇప్పటికే వైసీపీ నాయకులు స్పందించారు.

నిపై ఎన్నో ప్రశ్నలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )అన్నారు.ఈ ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉందని , ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో జమిలి ఎన్నికలపై కసరత్తు జరగాలని సజ్జల అన్నారు .అందరితో చర్చించిన తర్వాత జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు .ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం మంచి పరిణామం అని సజ్జల పేర్కొనడంతో ఏపీ ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉందనే విషయం తేలిపోయింది.ఏపీలో 2014 – 19 లోక్ సభ ఎన్నికలతో పాటు,  శాసనసభ ఎన్నికలు జరిగాయి.కేంద్రం కనుక జమిలి ఎన్నికలకు మొగ్గుచూపితే , ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపితే దానికి వైసిపి కూడా అంగీకారం తెలిపే అవకాశం కనిపిస్తోంది.

జమిలి ఎన్నికలు వస్తే .పార్టీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన వైసీపీ సమీక్ష చేసుకుంటోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *