కాంగ్రెస్ గూటికి చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ఈటల రాజేందర్
ఎన్నికలు వచ్చాయంటే చాలు రంగస్థలం సినిమాలోని ఆ పాట ఇప్పుడున్న రాజకీయ పార్టీల
నాయకులకు కరెక్టుగా సూట్ అవుతుంది.ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే.
“ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టు కొస్తావా”.అనే విధంగా తయారవుతోంది కొంతమంది నాయకుల తీరు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే 115 మంది
ఎమ్మెల్యేల లిస్టు ప్రకటించింది.దీంతో నాయకులంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో మునిగిపోయారు.
ఇక ఇదే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశించి చాలామంది నేతలు భంగపడ్డారు.ఈ తరుణంలో
కేసీఆర్ 115 మంది ప్రకటించిన లిస్టు ఫైనల్ కాదని బీఫామ్ వచ్చేవరకు తెలియదు అంటూ ఒక మెలిక పెట్టేశారు.
ఈ సందర్భంలోనే చాలామంది భంగపడ్డ నేతలు బీఆర్ఎస్ గట్టున ఉండలేకపోతున్నారు. అటు
కాంగ్రెస్,బిజెపి గట్టుకు వెళ్లలేకపోతున్నారు.ఎందుకంటే కేసీఆర్ ప్రకటించిన లిస్టు ఫైనల్ కాదని చెప్పేశారు.
ఒకవేళ బీఫామ్ ఇచ్చే టైంలో ఆ బంగపడ్డ నేతలకు బీఫామ్ వస్తుందని ఆశ పడుతూ కూర్చున్నారు.
కట్ చేస్తే ఇక బిజెపి నేతల పరిస్థితి మరి దారుణంగా తయారయింది.బండి సంజయ్ అధ్యక్షుడిగా తొలగిన
తర్వాత బిజెపిలో కాస్త నైరాశ్యం మొదలైంది.
కనీసం అన్ని నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులు కూడా లేకుండా ఉన్నారు.
అంతేకాకుండా బిజెపిని నమ్ముకుని ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో చేరిన నేతలు
మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.పార్టీ బిఆర్ఎస్ కు పోటీగా వస్తుందని అనుకుంటే, రోజురోజుకు
కనీసం ప్రజల్లో లేకుండా పోతుందని వారు భయపడుతున్నారట.కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని
ఆ కీలక నేతలంతా ఆలోచనలో పడ్డారట.
ఇదే తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకుండా గెలుపే లక్ష్యంగా అనేక కసరత్తులు చేస్తోంది.
ఈనెల 17వ తేదీన సిడబ్ల్యుసి కీలక సమావేశం, బహిరంగ సభ రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించనున్నారు.
దీనికి సోనియా గాంధీ ఇతర కీలక నేతలు కూడా రానున్నారు.దీని తర్వాత అభ్యర్థులను ప్రకటించే
అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్ ఇచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల్లో
బంగపడ్డ నేతలు బిజెపిలో చేరతారని అధిష్టానం భావిస్తుంది.
ఈ మూడవ స్థాయి నేతలు బిజెపిలో చేరితే గెలుపు సాధ్యమేనా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఇదే క్రమంలో పలువురు బిజెపి సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారట.
ఈ విషయాన్ని ఆ పార్టీ నుండి సస్పెండ్ అయినటువంటి యేన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.అలా చూస్తున్న
కీలక నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ఈటల రాజేందర్ కూడా ఉన్నారని ఆయన చెప్పకనే చెప్పినట్లు
గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం
అయ్యిందని తెలుస్తోంది .