ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 31.08.2023

జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

1. మేషం రాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే పనులు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యుతో ఆనందకరంగా గడుపుతారు. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. రాజకీయ నాయకులకు కలసివచ్చేటటువంటి రోజు. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించండి. శుభం కలుగుతుంది.

==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. అక్కరలేని ఖర్చుల వలన ఇబ్బందులు ఏర్పడును. అప్పులు చేయరాదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికము. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి అనుకూలం. రైతాంగం, సినీరంగం వారికి ఈరోజు మధ్యస్థం. దత్తాత్రేయుని పూజించండి. శ్రీగురుచరిత్ర పఠించండి. శుభం కలుగుతుంది.

===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికం. చికాకులతో కూడిన వాతావరణం. కుటుంబములో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వ్యాపారస్తులకు సమయానికి ధనము చేతికి అందదు. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. దత్తాత్రేయుని పూజించాలి. తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుబలం పెరుగుతుంది.

========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్మాటక రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మీ యొక్క ప్రణాళికబద్ధంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ధనపరమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేని రోజు, రైతాంగం, సినీరంగవారికి మధ్యస్థ సమయం. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శుభం కలుగుతుంది.
==========================================================================
సింహం :- సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సంయమనం పాటించడమే అన్నింటికీ పరిష్కారం. ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు కష్టంతో కూడియున్నటువంటి వాతావరణం. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమయ్యే పరిస్థితి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఘర్షణతో కూడిన వాతావరణం. చికాకులు అధికమగును. అప్పుల బాధ ఏర్పడును. ఖర్చులు అధికమగును. రైతాంగంవారికి అంత అనుకూలంగా లేదు. సినీరంగం వారికి మధ్యస్థం నుండి చెడు సమయం. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు కలసివచ్చే రోజు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది.

=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థమునుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు సమయం. రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గణపతి ధ్యానం రక్షిస్తుంది. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం వల్ల శుభం కలుగుతుంది.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మనస్సును నియంత్రించుకోవాలి. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోరాదు. ఇబ్బందులు కలుగును. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అదికం. సంతానం వలన చికాకులు ఏర్పడును. విద్యార్థులకు మధ్యస్తం. రైతాంగం వారికి అనుకూలం. దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే పనులు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగస్తులకు శుభ సమయం. స్థానచలన మార్పులు సత్ఫలితాలిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. గురుబలం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన నైవేద్యాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయములు ఏర్పడును. ఒత్తిళ్ళు అధికము. మానసిక ఘర్షణలు, గొడవలు, చికాకులు అధికమగును. స్త్రీలకు మధ్యస్థం నుండి చెడు సమయం. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. గణపతినీ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
==========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబములో ఏదో ఒక సమస్య వేధించును. రుణ సమస్యలు బాధించును. ఏ పని చేసినా చికాకులు కలుగును. ఉద్యోగస్తులకు మధ్యస్థం నుండి చెడు సమయం. వ్యాపారస్తులకు చెడు సమయం. విద్యార్థులకు మధ్యస్థం. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఘర్షణలతో కూడిన వాతావరణం. శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శుభఫలితాలు కలుగుతాయి.

======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు అధికమగును. ధనపరమైనటువంటి సమస్యలు అధికమగును. కోర్టు సమస్యలు ఇబ్బందిపెట్టును. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. అప్పులు చేయరాదు. నమ్మి ఇతరులకు ధనాన్ని ఇవ్వరాదు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు సమయం. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన నైవేద్యాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి

===========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *