ఉదయిస్తుండగానే అర్ఘ్యం!

 ఉదయిస్తుండగానే అర్ఘ్యం!

సూర్య నమస్కారాలు ఏ సమయంలో చేయాలి? అరుణోదయ వేళ సూర్యుడు పూర్తి స్థాయిలో వెలుగుచూడకముందు అర్ఘ్యప్రదానం ఇవ్వకూడదన్నారు ఎందుకు? అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి తెలియజేయండి?

  • రాధిక, హైదరాబాద్‌

ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌- ఆదిత్యుణ్ని ఉపాసించడం వల్ల ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్ర వచనం. ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఐహిక, ఆముష్మిక (పరలోక) ప్రయోజనాలు కలుగుతాయి. భానూదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయాలి. లేలేత సూర్యకిరణాలు శరీరంపై ప్రసరించడం ఆరోగ్యప్రదం. ఉదయం ఏ ఆహారం తీసుకోకముందు సూర్య నమస్కారాలు చేయడం శ్రేయస్కరమని ధ్యానయోగ శాస్త్రం చెబుతున్నది. ఇక విశ్వమంతటికీ మేలు చేస్తున్న సూర్యుడికి కృతజ్ఞతా పూర్వకంగా ఇచ్చేదే అర్ఘ్యం. ప్రాతఃకాలంలో తూర్పుగా ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా నిలబడి ‘శ్రీ సూర్యాయ అర్ఘ్య ప్రదానే వినియోగః’ సంకల్పంతో ఓంకార ప్రణవ పూర్వకంగా (ఉపదేశం ఉన్న వాళ్లు గాయత్రీ మంత్రం పఠిస్తూ..) అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడు పూర్తిగా ఉదయించే వరకూ మౌనంగా ఉండి ఉపదేశ మంత్రాన్ని మానసికంగా జపించాలి. సూర్యాష్టకం, ఆదిత్యహృదయం వంటి సూర్య స్తోత్రాలు సూర్యోదయం తర్వాత పఠించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *