50 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగంతో ఈ రాశులకు ఐశ్వర్యం

జాతకంలో గ్రహాలు, వాటి బలం, రాశులను బట్టి పండితులు భవిష్యత్తును తెలియజేస్తుంటారు. గత నెల 25వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించిన బుధుడితోపాటు శుక్రుడు, కుజుడు కూడా అదే రాశిలో ఉన్నారు. ఈ మూడు గ్రహాల కలయికవల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. 50 సంవత్సరాల తర్వాత అరుదుగా ఏర్పడే పరిణామమని, దీనివల్ల పలు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
కుంభ రాశి ఒకే రాశిలో కుజుడు, బుధుడు, శుక్రుడు కలవం కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. గతంలో మొదలై మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు బాగుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు వారి ప్రేమను విజయవంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు తమ ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.
తులారాశి త్రిగ్రాహి యోగం తులారాశివారికి విశేష ప్రయోజనాలను కలిగించనుంది. కెరీర్ కు ఆటంకంగా ఉన్నవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి.ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. వివాహం కానివారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. గతంలోకంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది. పై అధికారుల నుంచి పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.
మేషరాశి సింహరాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి అనేక ప్రయోజనాలను కల్పించనుంది. పనిచేసేచోట సహోద్యోగుల నుంచి మద్దతు దొరుకుతుంది. పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ-వ్యాపారాల్లో మేషరాశివారు విజయాలు సాధిస్తారు. అంతేకాదు.. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ప్రధానమైన పనులు చేసే విషయంలో జీవిత భాగస్వామితో చెప్పి చేయడంవల్ల అది ఫలిస్తుంది. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి.