5ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా – శ్రావణ ముహూర్తాలు..!!

శ్రావణ మాసం. ఈ మాసానికి అనేక ప్రత్యేకలు ఉన్నాయి. కోరికలు తీర్చే నెలగా నమ్మకం. శివకేశవుల ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించే భక్తులు శ్రావణమాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. వరలక్ష్మీ కటాక్షం కోసం అన్ని ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు. ఈ సారి శ్రావణంలో వివాహాలకు అనుకూల ముహూర్తాలు ఉన్నాయి. ఎనో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇదే నెలలో రాజకీయంగానూ కీలక నిర్ణయాలకు నేతలు సిద్దం అవుతున్నారు.
మొదలైన మంచి రోజులు: గత రెండు నెలలుగా ఆషాఢం, అధిక శ్రావణ మాసంతో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరుగలేదు. ఈ నెల 18 నుంచి డిసెంబర్ చివరి వరకూ పుష్కలంగా ముహూర్తాలు ఉండటంతో ఇక పెండ్లిళ్ల హడావిడి మొదలు అయింది. డిసెంబర్ వరకు వివాహాలకు మంచి రోజులుగా చెబుతున్నారు.
అందునా.. ఆగస్టు : 18,19,20,24,26,29,30,31 తేదీల్లో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో నిర్ణయించారు. సెప్టెంబర్ నెలో 1,2,3,6,7,8 తేదీలు, అదే విధంగా అక్టోబర్ నెలలో 22,24,25,26,27 తేదీలు మంచి ముహూర్తాలుగా గుర్తించారు. నవంబర్ లో 4,16,18,19, 22,23,24,25,29 తేదీలు, డిసెంబర్ నెలలో 2,3,6,7,8, 14,15,19,20,21,22,24 తేదీలు మంచి ముహూర్తాలు గా జ్యోతిష్యులు చెబుతున్నారు. శ్రావణంలో ప్రత్యేక రోజులు: ఇక, ఈ సారి శ్రావణ మాసంలో అయితే ఈ నెల 21న నాగుల పంచమి, 25న వరలక్ష్మి వ్రతాలు, 31 రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 7న కృష్ణాష్టమితోపాటు హయగ్రీవుడు, బదరీనారాయణుడు, వరహమూర్తి, సంతోషిమాత జయంతోత్సవాలు ఉన్నాయి. ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం, శుక్రవారం లక్ష్మి ఆరాధన ఎంతో శ్రేష్టమైనవి. సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తారు. రాఖీ పౌర్ణమి రోజునే జ్ఞాన దేవతగా పిలిచే హయగ్రీవ స్వామి జయంతి నిర్వహిస్తారు. లక్ష్మీదేవికి ధనం, సరస్వతికి అక్షరాభ్యాసం చేసింది ఈ స్వామియేనని పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మీ కటాక్షం కోసం అన్ని ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు.