25 డిసెంబర్ 2024:ఈరోజు స్వాతి నక్షత్రంలో సుకర్మ యోగం..కర్కాటకం సహా ఈ రాశుల వారు ప్రతి పనిలో సక్సెస్ సాధిస్తారు

 25 డిసెంబర్ 2024:ఈరోజు స్వాతి నక్షత్రంలో సుకర్మ యోగం..కర్కాటకం సహా ఈ రాశుల వారు ప్రతి పనిలో సక్సెస్ సాధిస్తారు

25 December 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు స్వాతి నక్షత్రంలో సుకర్మ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కర్కాటకం సహా ఈ 5 ఈరోజు ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో సుకర్మ యోగం ఏర్పడనుంది. మరోవైపు వినాయకుడి అనుగ్రహంతో కర్కాటకం, కన్య సహా ఈ 5 రాశులకు విశేష పురోగతి లభించే అవకాశం ఉంది. మీ సంపద పెరగొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేషరాశి

వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ పిల్లవాడు ఏదైనా పరీక్షకు హాజరైనట్లయితే, వారు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. దీని వల్ల మీ మనసు సంతోషిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ వ్యాపారంలో పెండింగ్‌లో ఉన్న ఏదైనా పని పూర్తవుతుంది. దానిని మీరు చూసి సంతోషిస్తారు. ఈరోజు మీ స్నేహితులతో కొంత సమయం గడుపుతారు. అంతేకాదు మీరు కొత్త స్నేహితులను కూడా కలుస్తారు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీమహావిష్ణువుకు లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.

వృషభ రాశి

వ్యాపారులు మంచి విజయాలు సాధిస్తారు. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఉపాధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావొచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామిని బయటికి నడకకు తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీరు తల్లిదండ్రుల సహాయంతో చేసే పనిలో శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు పాలనా, అధికారం యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి.

మిధున రాశి

ఈరోజు మీ వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయాలని మీరు ఆలోచిస్తుంటే, దానిని చాలా ఆలోచనాత్మకంగా చేయండి. లేకుంటే భవిష్యత్తులో మీకు భారీ నష్టాన్ని కలిగించొచ్చు. ఈరోజు పనిచేసే వ్యక్తులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులో విజయం సాధించి సంతోషిస్తారు. ఈరోజు మీ కుటుంబంతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొనొచ్చు.

ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.

కర్కాటక రాశి

ఈరోజు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడంలో నిమగ్నమై ఉంటే, మీరు విజయం సాధించొచ్చు. ఉపాధి ధ్యేయంగా పని చేసే వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ పిల్లల బాధ్యతలను నెరవేర్చడంలో కూడా విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు ఒక ప్రయాణానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాయంత్రం మీరు ప్రియమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. అందులో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా పొందుతారు.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న, పంచదార సమర్పించాలి.

సింహ రాశి

వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఈరోజు మీ ప్రసంగంలో సౌమ్యతను కొనసాగించాలి. ఎందుకంటే ఇది మీకు గౌరవాన్ని తెస్తుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే అందులో విజయం సాధిస్తారు. మరోవైపు మీరు కొత్త శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ సోదరుని సహాయంతో, మీ పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిని ఈరోజు పూర్తి చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం భాగస్వామ్యంతో చేస్తే, ఈరోజు మీరు దానిలో కూడా లాభం పొందుతారు.

ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.

కన్య రాశి

ఉద్యోగులు, వ్యాపారులు నిరంతరం చేసే ప్రయత్నాల వల్ల మంచి విజయం సాధిస్తారు. మీ సోమరితనాన్ని వదిలేసి కష్టపడి పనిచేయాలి. మీ వ్యాపార పురోగతిని ముందుకు తీసుకెళ్లగలరు. ఏదైనా చట్టపరమైన విషయం జరుగుతున్నట్లయితే, మధ్యాహ్నం తర్వాత మీరు అందులో విజయం సాధించొచ్చు. కుటుంబంలో మీ సోదరుడు లేదా సోదరితో మీకు ఏవైనా వివాదాలు ఉంటే, అది మీ తండ్రి సహాయంతో ఈరోజు పరిష్కరించబడుతుంది. మీ భాగస్వామితో పరస్పర ప్రేమ పెరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల జీవితాల్లో కొత్త శక్తి నింపబడుతుంది.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.

తులా రాశి

ఈరోజు చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు కుటుంబసభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదించబడొచ్చు. ఇది మీ కుటుంబంలో సంతోషాన్ని పెంచుతుంది. మీ వ్యాపారంలో చాలా కాలంగా లావాదేవీ సమస్య ఉన్నట్లయితే, ఈరోజు మీరు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు తగినంత మొత్తంలో డబ్బు పొందడంతో సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల అన్ని ముఖ్యమైన అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

వృశ్చిక రాశి

ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఏదైనా విభేదాలు ఉంటే, అది ఈరోజు మళ్లీ పెరగొచ్చు. కానీ సాయంత్రం నాటికి కుటుంబంలోని వృద్ధుల సహాయంతో ఇది పూర్తవుతుంది. ఈరోజు మీ బిడ్డ సామాజిక సేవ చేయడం చూసి సంతోషిస్తారు. ఈరోజు మీరు విదేశాల్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల నుండి శుభవార్త వింటారు. ఈరోజు సాయంత్రం మీ తల్లిదండ్రులను దేవుని దర్శనానికి తీసుకెళ్లొచ్చు.

ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *