సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్
సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్
సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
అసభ్యకర, అశ్లీల కంటెంట్‌పై సోషల్ మీడియాలు కఠినంగా చర్యలు తీసుకోవడం లేదని ఐటీశాఖ ఆరోపించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం థర్డ్‌పార్టీ సమాచారాన్ని ఆయా వేదికల్లో అప్‌లోడ్, ప్రచురణ లేదా వ్యాప్తి చేస్తే దీనికి సోషల్ మీడియా సంస్థలతో పాటు ఆయా ప్రచూరణ ప్లాట్‌ఫామ్‌లదే బాధ్యత అని వార్నింగ్ ఇచ్చింది. రూల్స్ పాటించకుంటే ఐటీ యాక్ట్, BNSతో పాటు ఇతర చట్టాల కింద సంబంధింత సంస్థలు, కస్టమర్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.