సైంధవ్
సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ ల్యాండ్ మార్క్ 75వ సినిమాగా సైంధవ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. నారప్ప మినహాయించి ఎక్కువగా ఎంటర్ టైనర్లు, థ్రిల్లర్లకు ప్రాధాన్యం ఇస్తున్న వెంకీకి ఫుల్ యాక్షన్ రోల్ లో చూడాలని కోరుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ ని తీర్చిదిద్దుతున్నట్టు ప్రమోషన్లు, పోస్టర్లలో అర్థమైపోవడంతో క్రమంగా హైప్ పెరిగింది. సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉన్నా సరే సలార్ వల్ల డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అయిన ఈ మూవీ రేసులో గెలిచేలా ఉందా
కథ
దక్షిణ భారతదేశం చంద్రప్రస్థ సముద్ర తీరంలో క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు సైంధవ్( వెంకటేష్). కూతురు గాయత్రి (బేబీ సారా) అంటే ప్రాణం. పక్కింటిలో ఉన్న టాక్సి ఆపరేటర్ మనోగ్య(శ్రద్ధ శ్రీనాథ్)తో స్నేహం చేస్తుంటారు. పిల్లలకు తుపాకులు ఇచ్చి తీవ్రవాదులుగా మార్చే ముఠా నాయకుడు మిత్ర(ముఖేష్ ఋషి), వికాస్(నవాజుద్దీన్ సిద్ధిక్)తో సైంధవ్ కు పాత శత్రుత్వం ఉంటుంది. స్కూల్లో ఓసారి పాప కళ్ళు తిరిగి పడిపోతే తనకున్న నరాల జబ్బుకు 17 కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు చెబుతారు. దీంతో ఇష్టం లేకపోయినా సైంధవ్ తిరిగి నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. చివరికి ఎలా సాధించాడనేది తెరమీద చూడాలి.