సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత.. కొవిడ్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు!

 సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత.. కొవిడ్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వల్ప జ్వరమే ఉందని.. తీవ్రమైతే హాస్పిటల్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేళ సీఎంకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇటీవల ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా టెస్టులు చేయించుకోనున్నారు.

కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.జేఎన్.1 వేరియంట్‌తో పలువురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ జారీ చేస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా 12 (డిసెంబర్ 24) కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ప్రస్తుతం తెలంగాణలో 38 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 1322 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున చిన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఉంటే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *