సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు, తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం

 సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు, తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం
  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స‌ర్వభూపాల‌ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు
  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స‌ర్వభూపాల‌ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
  • వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
  • సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
  • సర్వభూపాల వాహ‌న‌సేవ‌లో పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ.ధ‌ర్మారెడ్డి, అధికారులు పాల్గొ్నారు.
  • తిరుమలలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
  • సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై  శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇచ్చారు
  • గురువారం రాత్రి ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
  • వాహన సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో మాడ వీధులు జనసంద్రంగా మారిపోయాయి.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *