శని – రాహువు కలయిక.. అక్టోబరు 17 వరకు సవాళ్లు, సమస్యలు, కష్టాలు

శని రాహువు కలయికతో అశుభ ఘడియలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారు అక్టోబరు వరకు జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్యంలో ఈ రెండు గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం సానుకూలంగా ఉన్నప్పుడు జీవితంలో ఆనందం, శ్రేయస్సు తెస్తాయి. ప్రతికూలంగా ఉన్నప్పుడు వినాశనాన్ని కలిగిస్తాయి. తమ స్థానాలను మార్చుకొని కలిసినప్పుడల్లా ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ప్రస్తుతం శని అక్టోబరు 17 వరకు శతభిషా నక్షత్రంలో ఉంటాడు.ఈ ప్రభావం వల్ల అక్టోబర్ 17 వరకు కొన్ని రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. ఏయే రాశుల వారు అనేది తెలుసుకుందాం.
కర్కాటక రాశి : వీరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు. శని, రాహువు కలయికవల్ల మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో నష్టాలతోపాటు సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇది మిమ్మల్ని కలవరపెడుతుంది. అక్టోబరు వరకు జీవితం అనేక సవాళ్లను విసురుతుంది.
కన్యా రాశి : కన్యారాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. శని గ్రహానికి ఈ రాశిపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి.
వృశ్చిక రాశి : వీరికి స్వల్ప నష్టాలు ఎదురవుతాయి. ప్రతికూల ప్రభావం వీరి శృంగార సంబంధాలపై పడుతుంది. దీనివల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఆర్థికంగా విఫలమవుతారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుంభ రాశి : కుంభ రాశి జాతకులు అక్టోబర్ 17 వరకు కష్ట కాలాన్ని ఎదుర్కొంటారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు ఎదురవడంతోపాటు కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి.