వ్యూహం మార్చిన తెలంగాణ బీజేపీ
బీజేపీ రూట్ మార్చినట్టుంది. రాష్ట్ర స్థాయి నేతలపైనే కాకుండా లోకల్ లీడర్ల పైన చూపు తిప్పినట్టుంది .
నియోజక వర్గాల్లో బలంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకొంటే ఎక్కువ లాభం ఉంటుందని
కమలనాధులు అనుకున్నట్టు సమాచారం . ఎలాగూ రాష్ట్ర స్థాయి నేతలు పార్టీలో చేరటం పై పెద్దగా మొగ్గు
చూపడం లేదు . అలాంటప్పుడు అలాంటప్పుడు వాళ్ళకోసం వెయిట్ చేయడం గాలమేస్తూ కాలాన్ని వేస్ట్
చేసుకోవడం ఎందుకు అని అనుకున్నారట . అందుకనే వివిధ నియోజక వర్గాలలో మండల స్థాయిలో గట్టి
లీడర్లగా పేరున్న వాళ్ళను చేర్చుకోవడం పైన ఫోకస్ పెట్టారట .
నేతల జాయినింగ్స్ కమిటీ ఛైర్మెన్ గా ఈటల రాజేందర్ ఉన్నారు . ఐతే చెప్పొకో దగ్గ స్థాయి నేతలను పార్టీ లో
చేర్చిన దాఖలాలు లేవు . కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తరువాత నుండి బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలు
ఎవ్వరు చేరలేదు . అందుకనే కమిటీ ఫెయిల్ ఐనదనే చెప్పాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ లో చాలామంది
నేతలు చేరారు . ఇంకా చేరడానికి రెడీ గా ఉన్నారు. సో ఇదంతా చుసిన తరువాత రాష్ట్ర స్థాయి నేతలను
చేర్చుకోవడం పై ప్రయత్నాలు చేయడం అనవసరం అని అనుకుంటున్నారు .
ఇదే విషయం పై ఈటెల మాట్లాడుతూ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జాయింగ్స్ పై ద్రుష్టి పెట్టినట్టుగా చెప్పారు .
ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం లోను బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు . ఈటెల ప్రకటన పై
అందరిలోనూ అనుమానాలు మొదలైయ్యాయి . కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు
జె పి నడ్డా సమక్షం లోనే బీజేపీ లోనికి చేరడానికి ఎవ్వరు ఇష్ట పడకపోతే ఇక అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయి లో
చేరడానికి ఎవ్వరు ఇష్టపడతారు అనే చర్చ మొదలైంది.
విచిత్రం ఏమిటి అంటే అభ్యర్థుల ప్రకటన కేసీఆర్ చేయగానే పార్టీలో అసంతృప్తులు బయట పడుతున్నాయి .
టిక్కెట్లు రాని 7గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టిక్కెట్లు దక్కని ఆశా వాహుల్లో చాలామంది కేసీఆర్ పై
మండి పడుతున్నారు . వీళ్ళల్లో కూడా కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు . ఆంటే కానీ బీజీపీ వైపు ఎవ్వరు
చూడలేదు దీనితోనే కమల నాదుల్లో క్లారిటీ వచ్చేసింది . తమవైపు పెద్దనేతలు ఎవ్వరు రావడం లేదని
అందుకనే చివరి ప్రయత్నం గా కాంగ్రెస్ జాబితా కోసం ఎదురు చూస్తోంది . మరి బీజేపీ ప్రయత్నాలు
ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సిందే