రాష్ట్రంలో 5 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్.. సీఎం రేవంత్ సంచలనం

 రాష్ట్రంలో 5 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్.. సీఎం రేవంత్ సంచలనం

రాష్ట్రంలో గత పాలకులు విద్యను నాశనం చేశారని సీఎం రేవంత్ అన్నారు. 5 వేల స్కూళ్లు మూసేసి పేదలకు చదువును దూరం చేశారని చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమరంలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తమ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 5 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్ల మూతబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కారణంగా పేద పిల్లలకు చదువు దూరమైందంటూ చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కృషి చేశారని సీఎం రేవంత్ అన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని కొనియాడారు. ఎన్నికల్లో శాసనసభకు  పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందని, 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు.. ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలన్నారు. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుంది. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారు. చైల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన మీ అందరినీ అభినందిస్తున్నా.. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలల దినోత్సవం సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు సీఎం రేవంత్.  ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు,  ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *