రాశి ఫలాలు

 రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషం

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) సమావేశాల్లో కీలక ప్రాత పోషిస్తారు. స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం అందుకుంటారు. పదిమందిని కలుపుకుని మంచి పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం

వృషభం ( ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వైద్యం, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

మిథునం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ప్రియతములు, చిన్నారులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పొదులు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

కర్కాటకం

కర్కాటకం (జూన్‌ 22 – జూలై 23 మధ్య జన్మించిన వారు) కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

సింహం

సింహం ( జూలై 24 – ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) తోబుట్టువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వివాహ నిర్ణయాలకు సంబంధించిన చర్చలకు అనుకూలం. బందుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. శుభవార్త అందుకుంటారు.

కన్య

కన్య (ఆగస్టు 24 – సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాదిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

తుల

తుల (సెప్టెంబరు 24 – అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆడిటింగ్‌, క్రీడలు, రచనల రంగాల వారికి సంకల్పం నెరవే రుతుంది.

వృశ్చికం

వృశ్చికం (అక్టోబరు 24 – నవంబరు 22 మధ్య జన్మించిన వారు) విదేశాలు, దూరప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించిన చర్చలకు అనుకూలం. రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

ధనుస్సు

ధనుస్సు (నవంబరు 23 – డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) ఒక శుభవార్త అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. యూనియన్‌ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తారు.

మకరం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. నలుగురిలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహారాలపై దృష్టి పెడతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

మీనం

మీనం(ఫిబ్రవరి 20 – మార్చి 20 మధ్య జన్మించిన వారు) ప్రయాణాలు, విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. వారసత్వ వ్యవహారాలకు అనుకూలం. వైద్య సేవలు అందుకుంటారు. వడ్డీ వ్యాపారులకు అనుకూల సమయం. గత అనుభవాలతో లక్ష్యాలు సాధిస్తారు

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *