రాశి ఫలాలు :22-01-2025

 రాశి ఫలాలు :22-01-2025

మేషం

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరమ్మతులకు వెచ్చిస్తారు. వైద్య సేవలకు ఖర్చులు అధికం. మూచ్యువల్‌ ఫండ్‌ పెట్టుబడులు లాభిస్తాయి.

వృషభం

వృషభం ( ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పదమందిలో మాటపడాల్సి రావచ్చు. కుటుంబ విషయాల్లో పెద్దల సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటారు.

మిథునం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వైద్యం, ఆహారపదార్ధాలు, సేవల రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి.

కర్కాటకం

కర్కాటకం (జూన్‌ 22 – జూలై 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పన్నుల వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రీడలు, ఆడిటింగ్‌, విద్యారంగాల వారికి అనుకూలం.

సింహం

సింహం (జూలై 24 – ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ఆటంకాలు ఎదురవుతాయి.

కన్య

కన్య (ఆగస్టు 24 – సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) ఇంటర్య్యూలు, చర్చలు, ప్రయాణాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తోబుట్టువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

తుల

తుల (సెప్టెంబరు 24 – అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. గణపతి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం

వృశ్చికం (అక్టోబరు 24 – నవంబరు 22 మధ్య జన్మించిన వారు) మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇల్లు, స్థల సేకరణ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదు. లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

ధనుస్సు

ధనుస్సు (నవంబరు 23 – డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) తోబుట్టువులు, సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉన్నత విద్య విదేశీ వ్యవహరాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దూరప్రయాణాలు, చర్చలకు అనుకూల సమయం కాదు. ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురుతాయి. గణపతిని ఆరాధించండి.

మకరం

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు ఫలించకపోచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభించకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. శ్రీ రామచ్రంద మూర్తిని ఆరాధించండి.

కుంభం

కుంభం (జనవరి 21 – ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. పైఅధికారులు, పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. గణపతిని ఆరాధించండి.

మీనం

మీనం (ఫిబ్రవరి 20 – మార్చి 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. న్యాయ, బోధన, రవాణా రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు, చర్చలు వాయిదా వేసుకోవడం మంచిది. శ్రీ రామరక్ష స్తోత్ర పారాయణ శుభప్రదం.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *