రాశిఫలాలు 28 డిసెంబర్ 2023: ఈరోజు కన్య, తులా రాశి వారికి ధన లాభం..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే..

 రాశిఫలాలు 28 డిసెంబర్ 2023: ఈరోజు కన్య, తులా రాశి వారికి ధన లాభం..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే..

horoscope today 28 December 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…

horoscope today 28 December 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఇంద్ర యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కన్య, తుల రాశి వారు ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులు కొన్ని ప్రణాళికలను అమలు చేస్తారు. మీ బిజీ షెడ్యూల్ వల్ల మీ కుటుంబసభ్యుల కోసం సమయం కేటాయించలేక, మీ నాన్నగారు ఇచ్చిన పనిని వాయిదా వేయొచ్చు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారం వింటారు. ఈరోజు మీ ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గురువు, సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తెలివితేటలను ఉపయోగించి వ్యాపార శత్రువులను ఓడించడంలో విజయం సాధిస్తారు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతారు. ఈరోజు మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు.

ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పార్వతి దేవిని పూజించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. ఈరోజు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తే, అది మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు పెండింగులో ఉన్న కుటుంబ పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీ వ్యాపారంపై శ్రద్ధ చూపరు. మీ వ్యాపార ఒప్పందాలలో కొన్నింటిని వాయిదా వేయొచ్చు. ఇది మీకు నష్టం కలిగించొచ్చు. విద్యార్థులు ఈరోజు కుటుంబసభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ కారణంగా విద్యకు సంబంధించి మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలు ఈరోజు ముగుస్తాయి.

ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని నడుపుతుంటే మీకు మంచి లాభాలొస్తాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టే వారికి మంచి ఫలితాలొస్తాయి. మీ వ్యాపార ప్రత్యర్థులు ఈరోజు చురుగ్గా కనిపిస్తారు. అయితే మీ తెలివితేటలను ఉపయోగించి వారిని ఓడించడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబసభ్యులు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనొచ్చు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి.

 

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి సలహా తీసుకొని ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే, మీరు కచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. మీ ఇంటికి పెయింటింగ్‌పై కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయడంపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీ బిడ్డ తనకు నచ్చిన కోర్సులో ప్రవేశం పొందితే మీరు సంతోషంగా ఉంటారు.

ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఇంట్లో జరిగే కొన్ని శుభ సంఘటనల కారణంగా, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటాడు. మీ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్ని సీజనల్ వ్యాధులు ఆమెను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. విదేశాల నుండి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని శుభవార్తలను వింటారు.

ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి.

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఓపికతో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేయకుంటే భవిష్యత్తులో మీరు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. జీవనోపాధి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈరోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో ఎవరైనా వివాహానికి అర్హత కలిగి ఉంటే, ఈరోజు వారికి మంచి అవకాశం రావొచ్చు.

ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ శివ చాలీసా పఠించాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలి. వ్యాపారులు కొత్త పనులు చేస్తారు. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే, అది తిరిగొచ్చే అవకాశం లేదు. మీ జీవిత భాగస్వామిని విహారయాత్రకు తీసుకెళ్లొచ్చు. మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మీ సంపద తగ్గిపోవచ్చు. చిరు వ్యాపారులు ఈరోజు డబ్బు లేకపోవడం వల్ల కొంత అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు సామాజిక రంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. అది మీ గౌరవాన్ని పెంచుతుంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనిని పూర్తి చేయడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ కారణంగా మీ కుటుంబంలోని ఎవరైనా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాయంత్రం మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *