రాశిఫలాలు 23 మే 2025:ఈరోజు బుధాదిత్య రాజయోగం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు తిరుగనేదే ఉండదట..!

 రాశిఫలాలు 23 మే 2025:ఈరోజు బుధాదిత్య రాజయోగం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు తిరుగనేదే ఉండదట..!

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

అపర ఏకాదశి రోజున మేష రాశి వారిలో ప్రేమ జీవితాన్ని గడిపే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు. ఈరోజు మీ భాగస్వామితో శృంగారభరితమైన రోజును గడుపుతారు. మీ స్నేహితులలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ స్నేహితులో కొంత డబ్బు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం పెండింగ్‌లో ఉంటే, దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

అపర ఏకాదశి రోజున వృషభ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో పురోగతి లభిస్తుంది. ఒకేసారి బహుళ పనులు చేతిలో ఉండటం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. ఈరోజు, వ్యాపారం చేసే వ్యక్తులు చేదును తీపిగా మార్చే కళను నేర్చుకోవడం ద్వారా తమ పనిని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సంబంధాలలో కొనసాగుతున్న అసమ్మతి గురించి మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడొచ్చు. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది.

ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలి.

అపర ఏకాదశి వేళ మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే, అది సకాలంలో పూర్తి చేయాలి. ఒక బృందంగా పనిచేయడం ద్వారా మీరు ప్రజలను సంతోషపెట్టడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకోవాలి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ కృష్ణుడిని పూజించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు పనులను పూర్తి చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉది. దీంతో మీరు నిరాశ చెందుతారు. ఈరోజు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంలో ఏదో ఒక పూజ నిర్వహించడం వల్ల, కుటుంబసభ్యులు నిరంతరం వచ్చిపోతూ ఉంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు బ్రాహ్మాణులకు దానం చేయాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళికల నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. మీరు చదువు, ఆధ్యాత్మికత పట్ల కూడా పూర్తి ఆసక్తిని చూపుతారు. మీ పనిలో కొంత భాగాన్ని రేపటి వరకు వాయిదా వేయకుండా ఉండాలి. లేకుంటే మళ్లీ సమస్యలు తలెత్తొచ్చు. ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే, ఈరోజు మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు.

ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రాన్ని’ పఠించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాలని ఆలోచిస్తుంటే వారి కోరిక ఈరోజు నెరవేరుతుంది. మీ పని ప్రాంతంలోని సీనియర్ అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు, ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ పాత వ్యాధులు మళ్లీ కనిపిస్తాయి. వైద్య సలహా తప్పకుండా తీసుకోవాలి.

ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే, వారు దానిలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు విజయం సాధించగలుగుతారు. మీ ఆత్మగౌరవం పెరగడంతో, మీరు అన్ని పనులలో ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు, ఆ విషయం గురించి చర్చించాలి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలను చర్చించాలి, లేకుంటే మీ సంబంధం దెబ్బ తింటుంది.

ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారిలో సామాజిక రంగంలో పని చేసే వారికి మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మంచి పనులు చేయడం ద్వారా, మీరు గొప్ప ఉన్నత శిఖరాలను సాధించగలరు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మీ మనస్సులో ఉన్న సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే, వారు వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు మంచి ఫలితాలు రానున్నాయి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారికి ఈరోజు సాధారణ ఫలితాలొస్తాయి. మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తర్వాత మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ లభించొచ్చు. విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షల్లో రాణించేందుకు మరింత కష్టపడాలి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

మంచి ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మీపై కోపంగా ఉండొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు.

ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ లింగానికి పాలు సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈరోజు కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబసభ్యుల మధ్య ఏదో ఒక విషయంలో వివాదం ఉండొచ్చు. దీనిలో మీరు రెండు వైపులా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మీ మనసు ఒత్తిడి కారణంగా కలవరపడుతుంది. ఏదైనా ఆస్తి సంబంధిత సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే, అది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు రోజులో కొంత సమయం మీ తల్లిదండ్రులకు సేవ చేయడంలో కూడా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి.

ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *