ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు కుటుంబసభ్యుల నుండి అవసరమైన మద్దతు పొందుతారు. ఆదాయం పెంచుకునేందుకు విశేష అవకాశాలు పొందుతారు. మీ మాటలను నియంత్రించాలి. మీ కోపాన్ని నియంత్రించాలి. తద్వారా మీరు శుభ ఫలితాలను పొందడం కొనసాగించాలి. ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ పనులు సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.
ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ కృష్ణునికి వెన్న, పంచదార సమర్పించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు పాత సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. మీకు మనోబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీ పనిలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, సహకారం ఉంటుంది. మీరు ఇంటి వాతావరణంలో ఆనందం, శాంతిని పొందుతారు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ కుటుంబ వాతావరణం కొద్దిగా అల్లకల్లోలంగా ఉంటుంది.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఖరీదైన రోజుగా ఉంటుంది. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. ప్రత్యేక అవసరాల కారణంగా మీరు రుణం తీసుకోవలసి రావొచ్చు. ప్రణాళికా బద్ధంగా పని చేయాలి. మీ పనిలో అడ్డంకులు ఉండొచ్చు. వీలైతే, ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీకు పని మీద ఏకాగ్రత ఉండాలి. సాయంత్రానికి డబ్బు పాక్షికంగా రావడంతో, కొన్ని ఖర్చులు తగ్గిపోతాయి. ప్రభుత్వ పనిలో వైఫల్యం నిరాశకు దారి తీస్తుంది. రాత్రిపూట అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించినట్లు భావిస్తారు.
ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. పెట్టుబడి విషయంలో, మీరు రిస్క్ తీసుకోవచ్చు. మీరు లాభం పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి లభిస్తుంది. మీ ముఖ్యమైన పనులు పెండింగ్‌లో ఉంటే అవి ఈరోజు పూర్తి కావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. పిల్లల నుండి గౌరవం పొందడం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుంది. రాత్రి నుండి అన్ని రకాల పరిస్థితులు మెరుగుపడతాయి.
ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీకు పని ఒత్తిడి ఉండొచ్చు. సామాజిక రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి ఉంటుంది. ఈ కారణంగా మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఏదో విషయంలో అయోమయానికి గురవుతారు. ఈరోజు మీ శత్రువులు ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు సాయంత్రం ఏకాంతంగా గడపాలనుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు సద్వినియోగం చేసుకోగలిగే కొత్త అవకాశాలు వస్తాయి. సాధారణ రోజుల కంటే ఈరోజు వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ఇంట్లో కుటుంబసభ్యుల సంతోషం కోసం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకుని అయిష్టంగా ఖర్చు పెడతారు. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది.
ఈరోజు మీకు 94 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి.
తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. అపరిచితులను ఎక్కువగా విశ్వసించొద్దు. లేకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. వీలైతే, ఈరోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాలలో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లల విషయంలో ఆందోళనలు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గురువు లేదా సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు స్నేహితులు, సన్నిహితుల నుండి మద్దతు పొందుతారు. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి లాభాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు. మీరు కొత్త ప్రణాళికలో పనిని ప్రారంభించొచ్చు. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అధికారులు మీపై నిఘా పెంచుతారు. మీరు కొంచెం అజాగ్రత్తగా ఉంటే పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఎక్కడో ఒకచోట నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందొచ్చు. మీ ప్రభావం పెరుగుతుంది. మీరు శత్రువులను ఓడిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు పురోగతి ఉండొచ్చు. విక్రయాలు, మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది లాభదాయకమైన రోజు. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అయితే మీ ఇంట్లో మీ గౌరవం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ఇవన్నీ పట్టించుకోకుండా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీరు సరదాగా ఉండే మూడ్‌లో ఉంటారు. మీ ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది. మీరు పిల్లల వైపు నుండి ఆనందాన్ని పొందుతారు. మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు మెరుగైన పనితీరును కనబరుస్తారు. మీరు మధ్యాహ్నం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతారు. ఆ తర్వాత ఆకస్మిక ఆర్థిక లాభం కారణంగా సాయంత్రం మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఇతరుల లోపాలను ఎత్తి చూపడం వల్ల ఇంట్లో అసమ్మతి ఏర్పడుతుంది.
ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు వాదనలకు దూరంగా ఉండాలి. మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలపై విభేదాలు ఉండొచ్చు. మీ కోపం, మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలపై విభేదాలు ఉండొచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల పని తీరు నచ్చదు. మీ ఇంట్లో వాతావరణం ఈరోజు సాధారణంగా ఉంటుంది. డబ్బు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉంది.
ఈరోజు మీకు 96 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు కృషి, అంకితభావంతో, కార్యాలయంలో మెరుగైన పనితీరు కనబరుస్తారు. మీరు సోదరుల నుండి ప్రేమ, మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పని గురించి ఆందోళన చెందకుండా, ఈరోజు ప్రశాంతంగా గడపండి. రేపటి నుండి పరిస్థితి మెరుగుపడుతుంది. మరోవైపు మీ కుటుంబసభ్యుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల డబ్బు ఖర్చవుతుంది.
ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.