రాశిఫలాలు 22 జనవరి 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మేషం, కన్యతో సహా ఈ రాశుల ఆదాయంలో పెరుగుదల..!

 రాశిఫలాలు 22 జనవరి 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మేషం, కన్యతో సహా ఈ రాశుల ఆదాయంలో పెరుగుదల..!

రాశిఫలాలు 22 జనవరి 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మేషం, కన్యతో సహా ఈ రాశుల ఆదాయంలో పెరుగుదల..!

horoscope today 22 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…

రాశిఫలాలు 22 జనవరి 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మేషం, కన్యతో సహా ఈ రాశుల ఆదాయంలో పెరుగుదల..!
horoscope today 22 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మిధున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు బ్రహ్మ యోగం, ఇంద్ర యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మేషం, మిధునం, కన్య రాశుల వారి సంపద పెరిగే అవకాశం ఉంది. మిగిలిన రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

  • మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.సామాజిక రంగంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మీరు సన్నిహిత స్నేహితుని సహాయంతో ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువు ఆలయంలో పప్పు, బెల్లం సమర్పించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీ పనులను ఉత్సాహంగా చేస్తారు. అయితే కొందరు మీ పనులను అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.. మీ తెలివితేటలు ఉపయోగించి విచక్షణతో పని చేయండి. వ్యాపారులకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి.

ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ శివ చాలీసా పఠించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదరవచ్చు. మీ బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ పరిస్థితుల్లో వారు మీకు సహాయం చేయడానికి ముందుకు రారు. మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈరోజు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత మీరు పాత స్నేహితులను కలుస్తారు.

ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఉదయం నుండి శారీరక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతాయి. ఈ కారణంగా మధ్యాహ్నం సమయంలో చాలా అలసటగా అనిపిస్తుంది.. పని వ్యాపారానికి సంబంధించి అనేక ప్రణాళికలను రూపొందిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారు ఈ రోజు భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు. మీ మాటలు మీ పెద్దలు, పిల్లలను ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు చేసే పనిపై ఆసక్తి తగ్గొచ్చు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. లావాదేవీలు బాగానే జరిగినప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివయ్యకు చందనం తిలకం పూయాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి రావచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం తగ్గడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే అదనపు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తుల నుంచి బహుమతులు అందుకోవచ్చు. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శని దేవుడిని దర్శించుకుని తైలం సమర్పించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. సామాజిక పనుల కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు ముందు అనుకున్న ప్రణాళికలు అన్ని దెబ్బతింటాయి. వ్యాపారులు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉన్నప్పటికీ అభిప్రాయ భేదాల వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రాత్రి నల్ల కుక్కకు రోటీ తినిపించాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారు ఈ రోజు ప్రతికూల వార్తలను వింటారు. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఆర్థికపరమైన విషయాల్లో సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ డబ్బును పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి.

ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికపరంగా లాభాలు వస్తాయి. మెరుగైన ఫలితాలను పొందుతారు. అయితే మీరు పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో మార్పులు చేసుకోవాలని ఆలోచన రావచ్చు. ఈ రోజు మీ ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాలి.. మహిళలు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి.

ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో గందరగోళంగా ఉంటుంది. మీరు ఏ పనిపైనా ప్రత్యేక శ్రద్ధ వహించలేరు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందలేకపోవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి.. మీరు చేసే పనిలో సహోద్యోగులను భాగస్వాములుగా చేస్తూ ముందు కెళ్లాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈరాశి వారికి ఈ రోజు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. మీరు చేసే పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. మీ పని ప్రదేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.. ఈరోజు ఒకేసారి అనేక వనరుల నుంచి ఆదాయం పొందొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏకపక్షంగా వ్యవహరించకూడదు.

ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చీమలకు పిండిని జోడించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ మనసులో ప్రతికూల భావోద్వేగాల వల్ల మీరు అనుకున్న పనులు పూర్తి కాకపోవచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో అప్రమత్తంగా ఉండాలి.అజాగ్రత్త కారణంగా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.మీరు పని చేసే రంగంలో కష్టపడి పని చేస్తేనే ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులు ఆర్థికపరమైన లాభాల కోసం మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సూర్య నారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *