రాశిఫలాలు 15 ఫిబ్రవరి 2026:ఈరోజు ఈరోజు మహా శివరాత్రి వేళ వృషభం సహా ఈ 5 రాశులకు శివయ్య ప్రత్యేక ఆశీస్సులు..!

 రాశిఫలాలు 15 ఫిబ్రవరి 2026:ఈరోజు ఈరోజు మహా శివరాత్రి వేళ వృషభం సహా ఈ 5 రాశులకు శివయ్య ప్రత్యేక ఆశీస్సులు..!

రాశిఫలాలు 15 ఫిబ్రవరి 2026:ఈరోజు ఈరోజు మహా శివరాత్రి వేళ వృషభం సహా ఈ 5 రాశులకు శివయ్య ప్రత్యేక ఆశీస్సులు..!

horoscope today 15 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మహా శివరాత్రి వేళ కొన్ని అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శివయ్య ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి…

Daily Horoscope in Tel Feb15

horoscope today 15 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజున మహాశివరాత్రి పండుగ సందర్భంగా చతుర్గ్రాహి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం, బుధాదిత్య యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, వృషభం సహా ఈ 5 రాశులకు శివయ్య, సూర్యుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఇదే సమయంలో వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి మహాశివరాత్రి వంటి శుభప్రదమైన రోజున అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. వ్యాపారులకు లాభాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ కటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు కొత్తగా వ్యాపారం ప్రారంభించానుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివయ్య అనుగ్రహంతో అన్ని పనుల్లో మంచి విజయం లభించే అవకాశం ఉంది. మీరు అంకితభావంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం తినడం తగ్గించాలి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. గ్రహాల అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. లేదంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు.

ఈరోజు మీకు 60 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి మహాశివరాత్రి రోజున శుభ ఫలితాలు రానున్నాయి. మీరు సంతోషకరమైన వార్తలు వింటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఊహించిన దాని కంటే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మహాశివరాత్రి వేళ శివయ్య అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తులతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుని ప్రత్యేక ఆశీస్సులతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ సమయాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉండే వ్యక్తులకు కొత్త విజయాలు లభించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివయ్య ఆశీస్సులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఆస్తి, భూమి తదితర వాటిని కొనాలని చూస్తున్న వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు తల్లిదండ్రుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు.

ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా శివయ్య అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఏర్పడే శుభ యోగాల కారణంగా మీకు అనేక రంగాల్లో లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. యోగా, ధ్యానం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతీ దేవిని పూజించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు మీరు ఆస్తి, ఇల్లు ఇతర ఆస్తులను కొనే అవకాశం ఉంది. అంతేకాదు పెట్టుబడి పెట్టే వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అండతో మీకు మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీరు సంతోషంగా గడుపుతారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మహాశివరాత్రి వేళ శివయ్య ప్రత్యేక ఆశీస్సులతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. సమాజంలో మీకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. మరోవైపు స్నేహితులు, బంధువులు మీ గురించి చెడు ప్రచారం చేయొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శుభప్రదంగా ఉంటుంది. మీ స్నేహితులు, బంధువుల సహకారంతో అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. ప్రతికూల పరిస్థితులన్నీ క్రమంగా సానుకూల మారతాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కొంత పనిభారం పెరిగినప్పటికీ, కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు మీ పనులకు ఆటంకాన్ని కలిగిస్తాయి. అయితే ఓపికగా ఉండటం వల్ల మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి మోదకాలు సమర్పించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *