రాశిఫలాలు 14 ఫిబ్రవరి 2026:ఈరోజు బుధాదిత్య రాజయోగం వేళ వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..!

 రాశిఫలాలు 14 ఫిబ్రవరి 2026:ఈరోజు బుధాదిత్య రాజయోగం వేళ వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..!

horoscope today 14 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే…

Daily Horoscope in Tel Feb14

horoscope today 14 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, బుధుడు, చంద్రుడి ప్రభావంతో సిద్ధి, బుధాదిత్య, సునఫ, గజకేసరి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ తులా, మకరం సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఆర్థిక పరమైన రంగాల్లో మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు బుధాదిత్య రాజయోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. మరోవైపు మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పనుల కోసం అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారులు పాత వివాదాలను పరిష్కరించుకోవడంలో మంచి విజయం సాధిస్తారు. ఈరోజు మీకు ఇల్లు, ఆస్తి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం పొందుతారు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీక్రిష్ణుడిని పూజించాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీ పనులన్నీ అంకితభావంతో పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మరోవైపు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు గజకేసరి, బుధాదిత్య రాజయోగాల కారణంగా మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా చాలా పురోగతి సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. గ్రహాల అనుగ్రహంతో ఆస్తి సంబంధిత విషయాల్లో మంచి లాభాలు రానున్నాయి. ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించి కొంత దూరం ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

ఈరోజు మీకు 60 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు చాలా చురుగ్గా ఉంటారు. శుభ యోగాల ప్రభావంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవకాశాలు పొందుతారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయాలు సాధించే బలమైన అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి అన్ని రంగాల్లో పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. గ్రహాల శుభ సంచారం కారణంగా మీ భాగస్వామితో ఉండే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా తమ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు ప్రారంభంలో అతి ముఖ్యమైన పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు పొందుతారు.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అన్ని పనుల్లో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు ప్రతి ఒక్క పనిని ప్రణాళిక బద్ధంగా ప్రారంభిస్తారు. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. సీనియర్లు, జూనియర్ల నుంచి మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గురువు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడిపేందుకు ఛాన్స్ వస్తుంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు మీ పొరుగువారితో కొన్ని విభేదాలు రావొచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశాలున్నాయి.

ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు బుధాదిత్య, గజకేసరి వంటి శుభ యోగాల వేళ ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ కారణంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ స్నేహితులతో మంచి సమయం గడిపేందుకు అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల మద్దతుతో అనేక రంగాల్లో రాణిస్తారు. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. ఈరోజు ఏ ప్రయత్నం చేసినా అది విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతి దేవిని పూజించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మార్కెటింగ్ రంగంలో ఉండే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు మిమ్మల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేయొచ్చు. ఈ సమయంలో కీలకమైన పనులను వాయిదా వేయాలి. మీ బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వారితో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే కొందరు వ్యక్తులు మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు,పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు తమ లక్ష్యాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అంతేకాదు మీరు ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివ లింగానికి పాలు సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుక్రుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రారంభించే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలొచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి మోదకాలు సమర్పించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *