మైగ్రేన్‌ నొప్పిని తగ్గించే సింపుల్‌ చిట్కాలు.. ఇలా చేస్తే మీ తలనొప్పి చిటికెలో మాయం..!

 మైగ్రేన్‌ నొప్పిని తగ్గించే సింపుల్‌ చిట్కాలు.. ఇలా చేస్తే మీ తలనొప్పి చిటికెలో మాయం..!

అయితే, ఎక్కువ కెఫిన్ తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. బెల్లం పాలు తాగడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ తీవ్రంగా ఉన్నపుడు వేడి పాలలో కొద్దిగా బెల్లం వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇలాంటి తలనొప్పి ఎక్కువగా డీహైడ్రేషన్ వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, తలనొప్పి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు త్రాగటం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం తలకు కోల్డ్ కంప్రెస్ వేయడం వల్ల రక్త నాళాలు సంకోచించి నొప్పి తగ్గుతుంది. మెడ వెనుక భాగంలో వెచ్చని కంప్రెస్‌ను వర్తింపజేయడం వల్ల కండరాలు సడలించబడతాయి మరియు నొప్పి తగ్గుతుంది.

తలనొప్పిని తగ్గించటంలో అల్లం బెస్ట్‌ రెమిడీగా పనిచేస్తుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వికారం, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం టీ లేదా అల్లం ముక్క నమలడం వల్ల ఉపశమనం లభిస్తుంది. లావెండర్ ఆయిల్ వాసన చూడటం లేదా తలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. నుదురు, మెడపై పుదీనా నూనెను మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్లు వస్తాయి. కాబట్టి, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది.

మైగ్రేన్ సమస్య ఉన్నవారు చల్లటి ఆహారాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య తీవ్రమవుతుంది. కొద్ది మొత్తంలో కెఫిన్ మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, ఎక్కువ కెఫిన్ తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. బెల్లం పాలు తాగడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ తీవ్రంగా ఉన్నపుడు వేడి పాలలో కొద్దిగా బెల్లం వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *