ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. ‘కేసీఆర్‌ను 1000 కొరడా దెబ్బలు కొట్టాలి’

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీమాంధ్ర నేతల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన నష్టంపై కేసీఆర్‌ను వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలంటూ ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేకాకుండా, గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండని జగన్‌కు కేసీఆర్ సలహా ఇచ్చారని ఆరోపించారు. పూర్తి వివరాలు మీ కోసం..
హైలైట్:
- సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆ విషయంలో కేసీఆర్‌ను 1000 కొరడా దెబ్బలు కొట్టాలి
- కేటీఆర్‌పై కూడా సీఎం రేవంత్ సెటైర్లు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుంత రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీల మధ్య కృష్ణ జలాలకు సంబంధించిన వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా భవన్లో కృష్ణా, గోదావరి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
- తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎవరికీ తలొగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
- ఈ సందర్భంగా కేసీఆర్ సీమాంధ్ర నేతల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని విమర్శించారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేటీఆర్ పబ్లిక్ గా సవాల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.