‘మీ బహుమతులు మాకొద్దు తల్లీ’.. వెనక్కు ఇచ్చేసిన ఓటర్లు.. పోలీసులకు ఫిర్యాదు
Bhongir Municipality Voters Gifts Returned:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా సరే.. కొన్ని ఘటనలు విచిత్రంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వరూపరాణి పోటీచేశారు. ఆమె ఓడిపోవడంతో.. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె అనుచరులు తమ ఇళ్లపై దాడులు చేశారంటూ ఇళ్లపై దాడులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారంతా ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన బహుమతుల్ని తీసుకొచ్చి వెనక్కు ఇచ్చేశారు.
హైలైట్:
యాదాద్రి జిల్లా భువనగిరి 1వ వార్డులో ఘటన
బహుమతుల్ని వెనక్కు ఇచ్చేసిన ఓటర్లు
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Bhongir Municipality Voters
భువనగిరిలో ఓ వార్డు ఓటర్ల నిరసన
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చినా సరే చిత్ర, విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఓడిన అభ్యర్థుల తీరు హాట్‌టాపిక్ అవుతోంది. ఎన్నికల సమయలో పంపిణీ చేసిన బహుమతుల్ని ఓటర్లు వెనక్కు ఇచ్చేశారు.. బహుమతులు మాకు వద్దంటూ రోడ్డుపైకి తీసుకొచ్చి పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది.
1వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వరూపరాణి పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆమె పంపిణీ చేసిన చీరలు, హాట్‌బాక్స్‌లు, కుక్కర్లను వీధిలో రోడ్డుపైకి తీసుకొచ్చి పెట్టారు.. అక్కడే నిరసనకు దిగారు. ‘మేము అడగకుండా మాకు గిఫ్ట్ లు ఇచ్చి.. ఇప్పుడు గొడవ చేయడం ఏంటి.. ఓట్లు వేయలేదని దాడులు చేస్తారా? మీ గిఫ్టులు మాకు వద్దు’ అంటూ వారంతా ఆందోళన చేశారు. స్వరూపరాణి ఓడపోయిన తర్వాత ఆమె అనుచరులు, బంధువులు దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమపై దాడులు చేస్తున్న వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు వారంతా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
1వ వార్డులో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపరాణి అనుచరులు.. ఎన్నికల సమయంలో పంచిన డబ్బులు, చీరలు, హాట్‌బాక్స్‌లు తిరిగి ఇవ్వాలని ఓటర్ల ఇళ్లకు వెళ్లి తిరిగి ఇవ్వాలని హల్చల్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్వరూపరాణి దగ్గర గిఫ్ట్‌లు తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారని స్వరూపరాణి అనుచరుల ఆరోపణ. ఈ క్రమంలో శనివారం రాత్రి వార్డులోని కొన్ని ఇళ్లపైకి గ్లాస్ సీసాలు విసిరి దూషించినట్లు ఆరోపిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడులకు తనకు సంబంధం లేదని స్వరూపరాణి చెబుతున్నారు. తాను అసలు ఓటర్లకు హాట్ బాక్స్‌లు, కుక్కర్లు, చీరలు పంపిణీ చేయలేదని ఆమె అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్అ వుతున్నాయి. మొత్తానికి ఓడిన అభ్యర్థుల ఫీట్లు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని చోట్ల ఓడిన అభ్యర్థులు డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వమని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.