మీరు తిన్న వెంటనే కూర్చుంటున్నారా..? ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా..?

మనలో చాలా మంది భోజనం తర్వాత పది నిమిషాలు కూర్చోవాలని అనుకుంటాం. కొందరు వెంటనే పడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలసట తగ్గుతుంది అనుకున్నా.. దీని వల్ల శరీరానికి చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉన్న అన్నం లేక పిండి పదార్థాలు తిన్న తర్వాత కదలకుండా కూర్చుంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయి చాలా పెరుగుతుంది. ఇది అలాగే ఉంటే టైప్ 2 షుగర్ డిసీజ్ రావడమే కాకుండా.. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. దీన్ని ఆపడానికి ఒక చిన్న మార్గం ఉంది. భోజనం చేసిన తర్వాత కేవలం రెండు నిమిషాలు నడవడం.
నడక శరీరంలోని ముఖ్యమైన కండరాలను పనిచేయిస్తుంది. భోజనం తర్వాత నడిస్తే ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ శరీరంలో వేగంగా ఖర్చవుతుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది. అంతే కాదు మనం తీసుకునే ఎక్కువ క్యాలరీలు కూడా శరీరంలో తక్కువగా నిల్వ అవుతాయి. ఇది పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఒక ప్రసిద్ధ స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనాల ప్రకారం, భోజనం చేసిన వెంటనే 2 నుంచి 5 నిమిషాలు నడిచేవారిలో, కూర్చునే వారితో పోలిస్తే బ్లడ్ గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంది. ఈ చిన్న నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, అధిక రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.
అధ్యయనాల ప్రకారం.. భోజనం చేసిన వెంటనే 2 నుంచి 5 నిమిషాలు నడిచే వారిలో, కూర్చునే వారితో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంది. ఈ చిన్న నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ.. అధిక రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. భోజనం తర్వాత నడక వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది.
- గ్లూకోజ్ శరీరంలో త్వరగా ఖర్చవుతుంది.
- ఎక్కువ క్యాలరీల నిల్వ తగ్గుతుంది.
- జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- గుండె ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది.
- నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
దీనికి పెద్దగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. భోజనం అయిన 5 నుంచి 10 నిమిషాల తర్వాత కేవలం 2 నిమిషాలు నెమ్మదిగా నడిస్తే చాలు. ఇంటి ముందు, పార్కులో ఇలా ఎక్కడైనా నడవొచ్చు. ముఖ్యంగా నడక మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇది ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.
భోజనం తర్వాత రెండు నిమిషాలు నడవడం అనేది చిన్న మార్పు అయినా.. దీని వల్ల వచ్చే ఫలితాలు చాలా గొప్పవి. ఈ అలవాటును రోజూ పాటిస్తే డయాబెటిస్, అధిక బరువు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.