మాదాపూర్‌ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

 మాదాపూర్‌ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

మాదాపూర్‌ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

ఆక్రమణల కూల్చివేతలు, కబ్జాల కట్టడికి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా.. హైదరాబాద్‍‌లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షిస్తూ.. అందరి ప్రశంసలు పొందుతోంది. ఇటీవలె రూ.1500 కోట్ల ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకున్న హైడ్రా.. తాజాగా మరో రూ.2200 కోట్ల భూమిని రక్షించింది. హైడ్రా ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు ఈ భారీ ఆపరేషన్ సక్సెస్ చేశారు.

Madhapur

మాదాపూర్‌ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌ మహా నగరంలో మరో భారీ ఆపరేషన్‌ను హైడ్రా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. నగరంలోనే ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన మాదాపూర్‌లో ఏకంగా రూ.2200 కోట్ల విలువైన భూములను.. ఆక్రమణల చెర నుంచి విడిపించింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో ఉన్న మొండికుంట చెరువులో ఉన్న ఆక్రమణలను తొలగించింది. చెరువును ఆక్రమించి.. భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని.. వాటి ద్వారా షాపులు, షెడ్లు ఏర్పాటు చేసి.. కొందరు కబ్జాదారులు నెలకు రూ.లక్షల్లో అద్దెలు వసూళ్లు చేస్తున్నారని.. హైడ్రా అధికారులకు ప్రజావాణిలో వెల్లువెత్తిన ఫిర్యాదులతో ఈ ఆపరేషన్ చేపట్టారు.

స‌ర్వే నంబ‌ర్ 53 లోని మొండికుంట‌ చెరువుతో పాటు.. స‌ర్వే నంబ‌ర్ 55 లో ఉన్న ప్రభుత్వ భూమి ఎక‌రాల‌ కొద్దీ ఆక్రమణకు గురైందని స్థానికులు.. హైడ్రా అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల‌తో.. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భూమి దాదాపు 11 ఎక‌రాలు కొందరు క‌బ్జాకు గురైన‌ట్లు గుర్తించారు. మొండికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) ప‌రిధిలో ఉన్న ఆల‌యాన్ని హ‌ద్దుగా చూపించి.. కొందరు ఆక్రమణలు చేసినట్లు తేల్చారు.

అక్కడ ఉన్న ఆల‌యం హ‌ద్దుగా చూపించి.. ప‌లు దుకాణాలు, మెకానిక్ షెడ్డులు, ఐర‌న్ షాపు సహా రకర‌కాల షెడ్‌లు వేసి బిజినెస్‌లు చేస్తున్నట్టు గుర్తించారు. అక్కడ ఏకంగా 30కి పైగా దుకాణాలు ఏర్పాటు చేసి.. నెల‌కు లక్షల రూపాయల అద్దెలు వ‌సూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ఆదేశాలతో.. ఆ ఆక్రమణలను పూర్తిగా తొలగించిన అధికారులు.. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే గతేడాది 31వ తేదీన.. మొండికుంట‌తో పాటు దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలపై హైడ్రా విచార‌ణ చేప‌ట్టింది. ఇందులో రెవెన్యూ అధికారుల‌తో పాటు క‌బ్జాల‌కు పాల్పడిన వారు కూడా స‌మావేశంలో పాల్గొన్నారు. అప్పుడే ఆక్రమణలు జ‌రిగిన‌ట్లు కబ్జాదారుల ముందే రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. వీటితోపాటు ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఫోటోలను కూడా ప‌రిశీలించిన హైడ్రా అధికారులు.. ఆక్రమణలు జ‌రిగిన‌ట్లు నిర్ధారించారు.

అయితే కబ్జాదారులకు కొంత సమయం ఇచ్చిన హైడ్రా అధికారులు గురువారం రోజున ఏకంగా ఆక్రమణలను తొల‌గించింది. భారీ భద్రత మధ్య వంద‌లాది షెడ్‌లను హైడ్రా అధికారులు తొల‌గించారు. ఇక ఆక్రమణలను తొల‌గించడం పట్ల హైడ్రా అధికారులపై ప్రశంసలు గుప్పించిన స్థానికులు.. ఆ ప్రాంతంలో పార్కుల‌ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో మొండికుంట చెరువును డెవలప్ చేయాలని పేర్కొన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *