మహాశివరాత్రి పర్వదినం.. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ఉచితంగా పంపిణీ
దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయటంతో పాటు.. తాగునీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
హైలైట్:
మహాశివరాత్రి పర్వదినం
శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముస్తాబు
Srikalahasteeswara Temple
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని దేశంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మారుమాగోతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని శివయ్యకు అభిషేకాలు చేస్తున్నారు. ముక్కంటి సేవలో తరిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయ మానంగా అలంకరించారు. ఈరోజు ఉదయం 2 గంటల నుండి భక్తుల స్వామివారి దర్శనానికి పోటెత్తారు. భక్తుల రాక దృశ్య ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శానికి వచ్చే భక్తులు సపరేటుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రూ.500 ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. భక్తులకు త్రాగునీరు, చంటిపిల్లలకు పాలు, బిస్కెట్లు, ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
ఇక ఈనెల 23 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ఆర్జిత సేవలు స్వామి అమ్మవార్లకు లేవని పేర్కొన్నారు. మహాశివరాత్రి రోజున అన్ని రకాల రాహు కేతు పూజలు స్పెషల్ ఎంట్రన్స్ రూ.50 టికెట్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 16 వరకు పూర్తిగా అంతరాలయ దర్శనం రద్దు చేయడం జరిగిందని భక్తులు గమనించాలని ఆలయ ఈవో బాపిరెడ్డి పేర్కొన్నారు.
శివయ్య సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 23వ వరకు స్వామి అమ్మవార్లకు నిర్వహించే అభిషేకాలు రద్దు చేయడం జరిగిందని.. ఆలయానికి విచ్చేసే భక్తులకు సకాలంలో దర్శనం ఏర్పాట్లు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే సూచనల ప్రకారం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది వైభవోపేతంగా నిర్వహించేందుకు విద్యుత్ దీపాల అలంకరణలతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముస్తాబయిందన్నారు. స్వర్ణముఖి నది ఒడ్డున భక్తులకు పుణ్య స్థానాల ఆచరించుటకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.
బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు శివయ్య సన్నిధానంలో సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రత్యేక ఆహ్వానితులు విచ్చేస్తారని స్థానికులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిర్వహించే చిన్నారుల నృత్యాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కార్యక్రమాలు సజావుగా సాగుతాయని బ్రహ్మోత్సవాలు విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు, ఆలయ చైర్మన్, కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి విజ్ఞప్తి చేశారు.