మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు.
వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం అధికారులు భారీ ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ వేడుకలు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. అయితే ఈ వేడుకకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైళ్ల ద్వారా అక్కడికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళా కోసం రైల్వేశాఖ చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వారణాసి నుంచి రైలు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఇటీవల గంగానదిపై నిర్మించిన కొత్త బ్రిడ్జిని కూడా పరిశీలించారు.
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఈ కొత్త వంతెనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ గంగానదిపై తమ ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని నిర్మించిందని అశ్విమీ వైష్ణవ్ అన్నారు. ఇక కుంభమేళా కార్యక్రమం ఏర్పాట్ల కోసం భారతీయ రైల్వే గత రెండేళ్లలో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.