మరో 10 రోజుల్లో వీరంతా కుబేరులే

గ్రహాలు కాలానుగుణంగా ఉదయిస్తుంటాయి.. లేదంటే అస్తమిస్తుంటాయి. మనిషికి సంపదను, లగ్జరీ జీవితాన్ని ఇచ్చే శుక్రుడు ఆగస్టు 19వ తేదీన ఉదయించబోతున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో శుక్ర గ్రహం ఉచ్ఛస్థితిలో ఉంటుందో అటువంటివారు దేనికీ వెతుక్కోవాల్సి అవసరం ఉండదు. వారికి ఎందులోను లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు అస్తమించే దశలో ఉన్నాడు. ఈ నెల 19వ తేదీ ఉదయం 5.21 గంటలకు శుక్రుడు ఉదయించబోతున్నాడు. శుక్రుడి గమనంలో జరిగే ఈ మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
3 తుల రాశి : శుక్రుడి సంచారం తులారాశి వారికి కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు. దీనివల్ల వారికి అంతా లాభమే కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఈ సమయం వారికి అనుకూలంగా ఉంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నవారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి సలహా తీసుకొని అమలు చేయడంవల్ల ఎటువంటి నష్టం సంభవించదు.
మిథున రాశి : శుక్రుడు ఉదయించడం వల్ల మిథునరాశి వారు బాగా లాభపడనున్నారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దక్కుతుంది. వీరు శ్రమించేదాన్ని బట్టి ఉంటుంది. 19వ తేదీ నుంచి అదృష్టం మారనుంది. చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. అనుకున్నది కూడా సాధిస్తారు. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ తాజాగా పూర్తవుతాయి. కోరికలన్నీ నెరవేరతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి సమయాన్ని వెచ్చిస్తారు. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.
ధనస్సు రాశి : శుక్రుడి గమనంలో మార్పు ధనస్సు రాశి వారికి అనేక ప్రయోజనాలను కలిగించనుంది. ఆదాయ మార్గాలు ఏర్పడి.. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండటంవల్ల అంతా కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి అంతా లాభమే కలుగుతుంది. ఏ పని తలపెట్టిన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.